ఫేస్ బుక్ లో పరిచయమయ్యాడు..కిడ్నాప్ చేశాడు..28 రోజులుగా మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్!!

ఫేస్ బుక్.. బ్యాడ్ ఎఫెక్ట్స్ కు ఎన్నో నిండు జీవితాలు బలైపోయాయి. అయినా కాని యువత ధోరణి మాత్రం మారడం లేదు. తాజాగా ఫేస్ బుక్ లో ఓ యువకుడితో పరిచయం ఓ మైనర్ బాలిక పట్ల శాపంగా మారింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 28 రోజుల పాలిట ఆ బాలిక నరకాన్ని అనుభవించింది..

New Update
Rape Case : హైదరాబాద్ లో దారుణం.. వివాహితపై అత్యాచారం, హత్య!

ఫేస్ బుక్.. బ్యాడ్ ఎఫెక్ట్స్ కు ఎన్నో నిండు జీవితాలు బలైపోయాయి. అయినా కాని యువత ధోరణి మాత్రం మారడం లేదు. తాజాగా ఫేస్ బుక్ లో ఓ యువకుడితో పరిచయం ఓ మైనర్ బాలిక పట్ల శాపంగా మారింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 28 రోజుల పాలిట ఆ బాలిక నరకాన్ని అనుభవించింది. చివరికి ప్రాణాలతో అయితే బయటపడింది కాని..కన్నవారికి పెద్ద కష్టాన్నే తెచ్చిపెట్టింది. బీహార్ లో చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బీహార్ లోని ముజఫర్ నగర్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జులై 9న ఆరుగురు యువకులు కారులో వచ్చి 13 ఏళ్ల  బాలికను కిడ్నాప్ చేశారు. ఆమె తల్లి కూలీ పని చేస్తోంది. అయితే కూతురు కనిపించకపోవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఆగష్టు 5న బాధిత బాలిక తల్లికి ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. మీ అమ్మాయి సారియా చౌక్ లో ఉందని అతడు ఆమె తో అన్నాడు.

దీంతో వెంటనే సారియా చౌక్ కు పరుగులు పెట్టిన ఆమె అక్కడ పడి ఉన్న తన కూతురును ఇంటికి తీసుకొని వచ్చింది. తరువాత అసలు విషయం అడగ్గా.. ఆ బాలిక ఫేస్ బుక్ లో పరిచయమైన వ్యక్తి తన స్నేహితులతో తనను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు చెప్పింది. వెంటనే బాలిక తల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

పోలీసులు బాలికను మెడికల్ ఎగ్జామినేషన్ కోసం సదర్ హాస్పిటల్ కు తరలించారు. ఆమె స్టేట్మెంట్ ను రికార్డు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే నిందితులు పరారీలో ఉన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు