అన్న మందు మానేయమన్నాడు..తమ్ముడు చంపేశాడు!

మద్యం అతడిని మృగాడిని చేసింది. మందు తాగొద్దన్నందుకే సొంత తోబుట్టువును.. అందులో తండ్రిలా తన బాగోగులన్నీ చూస్తున్న అన్ననే హతమార్చేలా చేసింది. ఇక తాగుడికి బానిసై జీవితాన్ని పాడు చేసుకుంటావని తమ్ముడిని మందలించిన పాపానికి అన్న అతడి చేతిలోనే విగతజీవి అయ్యాడు.

New Update

He asked me to stop the drug..His brother killed him!

ఈ ఘటన ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం శంకర్రాజుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శంకర్రాజుపల్లి గ్రామానికి చెందిన యానక బాబు గత కొంత కాలంగా మందుకు బానిసయ్యాడు. ఎప్పుడూ చూసినా ఫుల్ గా తాగి ఉండేవాడు. పని కూడా మానేసి మద్యం తాగుతూ తిరగడం మొదలుపెట్టాడు. ఎవరు ఎంత చెప్పినా మందు మాత్రం మానడం లేదు.

దీంతో కళ్ళ ముందే సొంత తమ్ముడు మద్యానికి బానిసై జీవితాన్ని, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం చూడలేక అన్న యానక ముత్తయ్య అతడ్ని మందలించాడు. ఈ రోజు నుంచి తాగుడు బంద్ చేయాలని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఆగ్రహం తెచ్చుకున్న బాబు అన్న మాటలను మనసులో పెట్టుకొని  రోకలి బండతో తాగిన మైకంలో విచక్షణ కోల్పోయి ముత్తయ్య తల ఇంకా మెడ పై బలంగా కొట్టి అక్కడి నుంచి పారిపోయాడు.

దీంతో తీవ్ర గాయాలతో ముత్తయ్య అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో నిందితుడు బాబు కోసం పోలీసులు వెతుకుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు