హరియాణాలోనూ వర్గపోరు ...ఇద్దరు హోంగార్డుల దుర్మరణం..!

హరియాణాకు కూడా వర్గపోరు కార్చిచ్చు అంటుకుంది. నుహ్‌లో రెండు వర్గాలకు జరిగిన ఘర్షణలో ఇద్దరు హోం గార్డులు చనిపోయారు. ఓ వర్గం నిర్వహించిన యాత్రను వేరొక వర్గానికి చెందిన యువత అడ్డుకోవడం వల్ల ఘర్షణలు తలెత్తాయి. ఓ సంస్థ కార్యకర్త సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్ట్ ఈ అల్లర్లకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.ఈ ఘటనలో ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. ఊరేగింపులో పాల్గొన్న వాహనాలకు అల్లరి మూకలు నిప్పంటించాయి. మరి కొంతమంది యువకులతో పాటు పోలీసు సిబ్బంది గాయపడ్డారు. అల్లరి మూకను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు.మరోవైపు శాంతి భద్రతలను నెలకొల్పేందుకు హరియాణా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అల్లర్లు జరిగిన ప్రాంతంలో బుధవారం వరకు ఇంటర్‌నెట్‌ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది

New Update
హరియాణాలోనూ వర్గపోరు ...ఇద్దరు హోంగార్డుల దుర్మరణం..!

హరియాణాకు కూడా వర్గపోరు కార్చిచ్చు అంటుకుంది. నుహ్‌లో రెండు వర్గాలకు జరిగిన ఘర్షణలో ఇద్దరు హోం గార్డులు చనిపోయారు. ఓ వర్గం నిర్వహించిన యాత్రను వేరొక వర్గానికి చెందిన యువత అడ్డుకోవడం వల్ల ఘర్షణలు తలెత్తాయి. ఓ సంస్థ కార్యకర్త సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్ట్ ఈ అల్లర్లకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.

publive-image

ఈ ఘటనలో ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. ఊరేగింపులో పాల్గొన్న వాహనాలకు అల్లరి మూకలు నిప్పంటించాయి. మరి కొంతమంది యువకులతో పాటు పోలీసు సిబ్బంది గాయపడ్డారు. అల్లరి మూకను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు.

మరోవైపు శాంతి భద్రతలను నెలకొల్పేందుకు హరియాణా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అల్లర్లు జరిగిన ప్రాంతంలో బుధవారం వరకు ఇంటర్‌నెట్‌ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. రోడ్లపై జనం గుమిగూడడాన్ని నిషేధించారు పోలీసులు. అల్లర్లలో నీరజ్ అనే ఓ హోం గార్డ్ చనిపోయినట్లు వారు వెల్లడించారు.

పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అదనపు భద్రతా సిబ్బందిని హెలికాప్టర్‌ ద్వారా తరలిస్తున్నట్లు హరియాణా హోంశాఖ మంత్రి అనిల్‌ విజ్‌ తెలిపారు. ఎప్పటికప్పుడు అధికారులతో అప్రమత్తం చేస్తున్నట్లు ఆయన వివరించారు.

పరిస్థితులను అదుపులోకి తీసుకురావడమే తమ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. శాంతిని పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు..రాష్ట్రంలో శాంతి భద్రతలకు కృషి చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుందామని తెలిపారు.

భారత రాజ్యాంగానికి మించిన వారేవరూ లేరని.. రాష్ట సమగ్రత, శాంతి కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఉండాలన్నారు. " ఈ రోజు జరిగిన ఘటన చాలా బాధాకరం. అల్లర్లకు కారణమైన వారిని అస్సలు ఉపేక్షించం. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం." అని ఖట్టర్ ట్వీట్ చేశారు.

ప్రజలంతా సోదర భావాన్ని కలిగి ఉండాలని, శాంతి కోసం కృషి చేయాలని.. కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ హరియాణా ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ కోరారు. అదేవిధంగా నుహ్ ప్రస్తుత ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకులు అఫ్తాబ్ అహ్మద్ అభ్యర్థించారు.

మాజీ ఎమ్మెల్యే జాకీర్ హుస్సేన్ కూడా శాంతియుతంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.పుకార్ల నమ్మొద్దని ప్రజల్ని కోరారు అహ్మద్. శాంతి భద్రతల్లో నెలకొల్పడంలో అధికార యంత్రాంగం, పోలీసులు విఫలమయ్యారని ఆయన ఆరోపించారు.

ఇదిలా ఉండగా.. సామాజిక మాధ్యమాల్లో ఎలాంటి అభ్యంతరకర పోస్టులు పెట్టరాదని గురుగ్రామ్ డిప్యూటి కమీషనర్ నిశాంత్ కుమార్ హెచ్చరించారు. అటువంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సూచించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు