Happy Ugadi 2024 Wishes : క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.. ఈ స్పెషల్ కోట్స్ మీకోసం.!

ఉగాది నుంచి తెలుగు కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. క్రోధినామ సంవత్సరం మనలోని కోపాన్ని, ద్వేషాన్ని జయించి ప్రేమ, సహనంతో ముందుగా సాగాలని స్పూర్తినిస్తుంది. ఆర్టీవీ తరపున తెలుగువారందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ప్రత్యేకమైన కోట్స్ మీకోసం.

New Update
Happy Ugadi 2024 Wishes : క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.. ఈ స్పెషల్ కోట్స్ మీకోసం.!

Happy Ugadi 2024 Wishes : ఉగాది(Ugadi) అంటేనే తెలుగు ప్రజల పండుగ. ఈ రోజు నుంచి తెలుగు కొత్త సంవత్సరం(Telugu New Year) ప్రారంభమవుతుంది. ఈ ఉగాది పండగను ప్రతి ఏడాది మార్చి చివరి వారంలో ఏప్రిల్ మొదటివారంలో వచ్చే చైత్ర శుద్ధ పాడ్యమి రోజు జరుపుకుంటారు. అంతేకాదు ఈ రోజు పంచాంగంలో భాగంగా కొత్త సంవత్సరంలో గ్రహాల స్థితులు రాశిఫలాలు(Zodiac Signs) కూడా తెలుసుకుంటారు. అలాగే ఉగాది నాడు హిందువులంతా ఎంతో ప్రామఖ్యత కలిగిని పిండివంటలతో పాటు ఉగాది పచ్చడిని తింటారు. గ్రామాల్లో ప్రతి ఇంటికి మామిడి ఆకుల తోరణాలు కళకళలాడుతుంటాయి. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న ఉగాది పండగ ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మీప్రియమైనవారికి ఈ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి.

1. అందరూ ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

2. తీపి, చేదు కలిసిందే జీవితం..
కష్టం,సుఖం తెలిసిందే జీవితం..0
ఆ జీవితంలో ఆనందోత్సాహాలు పూయించేందుు వస్తుంది ఉగాది పర్వదినం
శ్రీక్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

3. మధురమైన ప్రతిక్షణం, నిలుస్తుంది జీవితాంతం
రాబోతున్న కొత్త సంవత్సరం ఇలాంటి క్షణాలనెన్నో అందించాలని ఆశిస్తున్నాను.
క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

4. కష్టసుఖాల జీవితంలో చవి చూడాలి మాధుర్యం, అదే ఉగాది పచ్చడి తెలియచెప్పే నిజం
అందరికీ ఉగాది శుభాకాంక్షలు.

5. మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు 2024 ఉగాది శుభాకాంక్షలు..

6. యుగాది గడిచిపోయినా
ఉగాది తిరిగి వచ్చింది
కొత్త సంవత్సరం
కొత్తదనాన్ని తెస్తుంది.. ఉగాది శుభాకాంక్షలు.

7. ఈ నూతన సంవత్సరం ఉగాది మీకు సంతోషం, శాంతి, శ్రేయస్సును ప్రసాదించుగాక.. ఉగాది శుభాకాంక్షలు 2024..

8. లేత మామిడి ఆకుల తోరణాలు, శ్రావ్యమైన కోయిల రాగాలు, అందమైన ముగ్గులు
కొత్త వస్త్రాలతో కళకళలాడిపోతున్న పిల్లలు, ఉగాది పండుగ సంబరాలు ఎన్నో

మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు.

ఇది కూడా చదవండి : ఉగాది నాడు ఈ 5 ప్రదేశాలలో దీపం వెలిగిస్తే అదృష్టలక్ష్మీ తలుపు తట్టడం ఖాయం.!

Advertisment
Advertisment
తాజా కథనాలు