Guntur: శ్రీనాధ్ ను చంపేసింది భార్యేనా? హత్య వెనుక ఇంత పెద్ద కారణముందా? అమెరికాలో ఏడాది క్రితం గుంటూరు యువకుడు శ్రీనాధ్ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ తండ్రి బాబూరావు ఏపీసీఐడీకీ ఫిర్యాదు చేశారు. నిందితులుగా శ్రీనాధ్ భార్య సాయి చరణీ , మామ సుఖవాసి శ్రీనివాసరావు, అత్త రాజశ్రీ ఉన్నట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 13 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Guntur: అమెరికాలో ఏడాది క్రితం గుంటూరు యువకుడు గంగూరి శ్రీనాధ్ మరణం పై అనుమానం ఉందని తండ్రి బాబూరావు చేసిన ఫిర్యాదు మేరకు ఏ పీ సి ఐ డి పోలీస్ లు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో శ్రీనాధ్ భార్య సాయి చరణీ, మామ సుఖవాసి శ్రీనివాసరావు, అత్త రాజశ్రీ ని నిందితులుగా చేరుస్తూ సి ఐ డి పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. బంధువులు, మిత్రుల ద్వారా తమ కుమారుడి మరణంపై ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు పలు రకాలుగా సమాచారం సేకరించిన బాబూరావు చివరకు అది అనుమానాస్పద మరణం అని నిర్ధారణకు వచ్చి అమెరికాలో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. వియ్యంకుడు సుఖవాసి శ్రీనివాసరావు వారిపై బెదిరింపులకు దిగటంతో పాటు అక్కడే నివసిస్తున్న శ్రీనాధ్ సోదరి కుటుంబాన్ని ఇబ్బందుల పలు చేస్తామని హెచ్చరించారు. దీంతో ఇన్ని రోజులు కుమారుడి మరణాన్ని మౌనంగానే భరించిన బాబూరావు సన్నిహితుల, న్యాయవాదుల సలహామేరకు సిఐడి పోలీసులను ఆశ్రయించారు. వారు కేసు నమోదు చేశారు. Also Read: లోక్ సభలో భద్రతా వైఫల్యం.. టియర్ గ్యాస్ వదిలిన ఆగంతకులు..అసలేమైందంటే? శ్రీనాధ్, సాయి చరణీకి 2016 డిసెంబర్ లో వివాహం జరిగితే 2017 జనవరిలో భార్యాభర్తలు అమెరికా వెళ్లారు. పెళ్లి నాటికే వర్జీనియా వే లో డవేటా సంస్థలో ఉద్యోగం చేస్తున్న శ్రీనాధ్ తన భార్యను డిపెండెంట్ వీసా పై అక్కడికి తీసుకెళ్లారు. అక్కడకు వెళ్లిన కొద్దీ రోజులకే తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, తన తల్లి తండ్రులు సుఖవాసి శ్రీనివాసరావు, రాజశ్రీ బలవంతం పై ఈ పెళ్లికి అంగీకరించానని చరణీ చెప్పటం ప్రారంభించింది. ఎప్పటికైనా నిన్ను చంపేస్తాను అని బెదిరించటం జరిగింది. కుమారుడి ద్వారా ఈ విషయం తెలుసుకున్న బాబూరావు తన వియ్యంకుడితో చర్చిస్తే తమ కుమార్తెకు సర్ది చెప్తామని హామీ ఇచ్చారు. ఆ తరువాత కొద్దీ రోజులు బాగున్న చరణీ తాను అనుకున్నది సాధించుకునేందుకు చాకుతో చెయ్యి నరాలు కోసుకుంటానని బెదిరించటం, అమెరికాలో రాంగ్ రూట్ లో కారు నడిపి ప్రమాదాలు చేయటం జరిగింది. 2019లో గుంటూరులో జరిగిన బంధువుల వివాహానికి భర్త తో కలిసి వచ్చిన చరణీ తిరుగు ప్రయాణంలో ఆడపడుచు కుటుంబం పక్కన విమానంలో సీట్ వచ్చిందనే కారణంతో బోర్డింగ్ ఐన తరువాత దిగి వచ్చేసింది. తన భార్యకు అనారోగ్యంగా ఉందని కారణం చెప్పి శ్రీనాధ్ విమానం నుంచి లగేజ్ వెనక్కు తెప్పించారు. అప్పటికే కూతురు,కుమారుడి కుటుంబాలను హైదరాబాద్ లో విమానం ఎక్కించి గుంటూరు తిరుగు ప్రయాణం ఐన బాబూరావు దంపతులు వెనక్కు వచ్చి కొడుకు, కోడలిని తమ వెంట తీసుకెళ్లారు. ఆ తరువాత వారం రోజులకు శ్రీనాధ్, చరణీ అమెరికా వెళ్లారు. తొలుతనే ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పిన చరణీ పిల్లలు పుట్టకుండా మెడిసిన్స్ వాడటం ప్రారంభించింది. పిల్లలు పుడితే తన అందం తగ్గుతుందని భర్తతో చెప్పిన చరణీ .. తనకు వివాహం కాలేదని చెప్తూ రీల్స్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పోస్టింగ్ లు పెట్టేది. ఇదిలా ఉంటె అమెరికా కాలమానం ప్రకారం గత ఏడాది అక్టోబర్ 16న తన అత్తామామలకు ఫోన్ చేసిన చరణీ.... శ్రీనాధ్ చనిపోయాడని సమాచారం ఇచ్చింది. దీంతో తీవ్ర దిగ్బ్రాంతికి లోనైన బాబూరావు దంపతులు, వియ్యంకుడు శ్రీనివాసరావు తో కలిసి అమెరికా వెళ్లారు. అక్కడ కుమారుడి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ కార్యక్రమాలకు హాజరు కానీ చరణీ , తండ్రి సుఖవాసి శ్రీనివాసరావును ... శ్రీనాధ్ తల్లి తండ్రులు ఇంటిలోకి కూడా అనుమతించలేదు. మా అబ్బాయి ఎలా చనిపోయాడు అని శ్రీనాధ్ తల్లి తండ్రులు కోడలిని అడిగితే మేము ఇద్దరమూ రెండు రోజులపాటు యోనోహిల్స్ కు ట్రెక్కింగ్ కు వెళ్ళాము, మొదటి రోజు బాగానే తిరిగి వచ్చాము, రెండో రోజు కాలు జారీ లోయలోకి పడిపోయాడు అని చెప్పింది, వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చావా అని అడిగితే తాను ఇవ్వలేదని, కొద్దీ దూరంలో ఉన్న అమెరికా జంట పోలీస్ లకు సమాచారం ఇచ్చారని తెలిపింది. అక్కడే కొద్దిరోజులు ఉన్న బాబూరావు దంపతులు కుమారుడి మరణం గురించి విచారించి అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయాలని ప్రయత్నిస్తే అక్కడే ఉన్న సుఖవాసి వీరిపై ఒత్తిడి తెచ్చి, బెదిరించి ఇండియాకు పంపించారు. ఈ నేపథ్యంలో బాబూరావు సిఐడిని ఆశ్రయించటంతో కేసు నమోదు చేశారు. #andhra-pradesh-cid మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి