Guntur Karam: "గుంటూరు కారం" సాంగ్స్ సీక్రెట్ ఏంటో.. చెప్పేసిన నిర్మాత నాగ వంశీ ..! త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న 'గుంటూరు కారం' కోసం అభిమానులు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. రీసెంట్ గా నిర్మాత నాగ వంశీ ఈ సినిమా పాటల గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు. సినిమాలోని మూడు పాటలు సంవత్సరం పాటు వినేలా అద్భుతంగా ఉంటాయని చెప్పారు. By Archana 21 Nov 2023 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Guntur Karam: సూపర్ స్టార్ మహేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'గుంటూరు కారం' సినిమా కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పలు మార్పులు జరిగిన సంగతి తెలిసిందే. ముందుగా ఈ సినిమాకు పూజ హెగ్డే ను హీరోయిన్ గా ప్రకటించి.. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల శ్రీలీలను రీ ప్లేస్ చేశారు. అంతే కాదు రీసెంట్ గా 'గుంటూరు కారం' సినిమాటోగ్రాఫర్ సినిమా మధ్యలోనే తప్పుకున్నట్లుగా నెట్టింట్లో వార్తలు వినిపించాయి. ఇది ఇలా ఉండగా.. ఇటీవలే గుంటూరు కారం సినిమా నుంచి థమన్ మ్యూజిక్ డైరెక్షన్ లో.. "దమ్ మసాలా" అనే మొదటి సాంగ్ విడుదల చేశారు. ఈ సాంగ్ మాస్ ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకుంది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు నిర్మాత నాగ వంశీ. 'ఆదికేశవ' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న నిర్మాత నాగ వంశీ.. 'గుంటూరు కారం' సినిమా గురించి మాట్లాడుతూ.. 'గుంటూరు కారం' లో తర్వాత రాబోయే మూడు పాటలు సంవత్సరం పాటు వినేలా అద్భుతంగా ఉంటాయని చెప్పారు. సహజంగానే థమన్ మ్యూజిక్ అనే సరికి ప్రేక్షకుల్లో అంచనాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈవెంట్ లో నిర్మాత నాగ వంశీ సినిమా పాటల గురించి మాట్లాడింది చూస్తుంటే.. సినిమాలో సాంగ్స్ కాస్త డిఫరెంట్, సూపర్ హిట్ మెలోడీస్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమా షూటింగ్ పనులు బ్రేక్స్ లేకుండా బిజీగా సాగుతున్నాయి. సంక్రాంతి బరిలో ఈ సినిమాకు పోటీగా ఐదు సినిమాలు రాబోతున్నాయి. కానీ అందరి ఫోకస్ మాత్రం మహేష్ బాబు 'గుంటూరు కారం' పైనే ఉన్నాయి. మరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'గుంటూరు కారం' బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డ్స్ సృష్టిస్తుందో చూడాలి. Also Read: Chiranjeevi: త్రిషపై నటుడి హాట్ కామెంట్స్.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్..! #guntur-karam-movie #guntur-kaaram-songs #guntur-kaaram-updates మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి