అభివృద్ధి ఓర్వలేక సీఎం జగన్ పై విమర్శలు: మంత్రి అమర్ నాథ్ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి ఓర్వలేక సీఎం జగన్ పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి గుడివాడ అమర్ నాథ్. జగన్ చేసిన అభివృద్ధిని అంకెలతో సహా చెబుతాం అంటూ ధీమ వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 16 Nov 2023 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి Gudivada Amarnath: రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి ఓర్వలేక సీఎం జగన్(CM Jagan) పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి గుడివాడ అమర్ నాథ్(Gudivada Amarnath). వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాతే ఏపీ అభివృద్ధి చెందిందని వ్యాఖ్యనించారు. జగన్ చేసిన అభివృద్ధిని అంకెలతో సహా చెబుతాం అంటూ ధీమ వ్యక్తం చేశారు. Also Read: అక్కడ సెల్ఫీ దిగుతున్నారా.. అయితే మీ ఓటు రద్దే రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఇచ్చిన జిఎస్‌డిపి గ్రోత్ రేట్ ప్రకారం.. 2019 నాటికి జిఎస్‌డిపి 22 వ స్థానంలో ఉంటే 2023 నాటికి నంబర్ వన్ స్థానంలో ఉందని వెల్లడించారు మంత్రి గుడివాడ అమర్ నాథ్. ఏపిలో తలసరి ఆదాయం 2019 లో 17 వ స్థానంలో ఉంటే..ఇప్పుడు 9 వ స్థానంలో ఉందని తెలిపారు. వైసిపి రాక ముందు ఏపీ వ్యవసాయంలో 27 స్థానంలో ఉంటే..ఇప్పుడు 6 వ స్థానంలో ఉందని వెల్లడించారు. Also Read: ఈ ఆకుకూర ఎక్కడైనా కనిపిస్తే అస్సలు వదలకండి..ఎందుకంటే..? పెట్టుబడుల విషయంలో గుజరాత్ తర్వాత స్థానం ఏపీదేనని చెప్పారు మంత్రి గుడివాడ అమర్ నాథ్. జగన్ పాలనకు ఈ ర్యాంకింగ్సే నిదర్శనమని అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లోనూ ఏపి ముందు అంచలో ఉందని వ్యాఖ్యనించారు. ప్రపంచ పారిశ్రామిక వేత్తలందరూ ఏపీ వైపే చూస్తున్నాయని పేర్కొన్నారు. ఏపీ నుండి వెళ్ళిన ట్యాక్స్ లనే కేంద్రం ఇస్తోంది తప్ప అక్కడి నిధులు ఏ మాత్రం ఇవ్వడం లేదని విమర్శించారు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబుపై(TDP Chandrababu) విమర్శలు గుప్పించారు. 70 శాతం పోలవరం కట్టడం కాదు..70 శాతం కొట్టేశారని ఫైర్ అయ్యారు. #ap-cm-jagan #ap-minister-gudivada-amarnath #tdp-chief-chandrababu-naidu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి