Green Chutneys : ఈ ఆకుకూర చట్నీస్ తింటే.. ఆరోగ్యానికి ఇంత లాభమా..!

శరీరంలో అధిక చెడు కొలెస్ట్రాల్ ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతుంది. కొన్ని ఆరోగ్యకరమైన ఆకుకూర పచ్చళ్ళు చెడు కొవ్వులను తగ్గించడానికి సహాయపడును. వాటిలో పాలకూర, మెంతి, పుదీన, కరివేపాకు ఆకుకూర చట్నీలు ఉన్నాయి. వీటిని ఆహారంలో చేర్చితే మంచి ప్రభావం చూపుతాయి.

New Update
Green Chutneys : ఈ ఆకుకూర చట్నీస్ తింటే.. ఆరోగ్యానికి ఇంత లాభమా..!

Benefits Of Eating Green Chutneys : జీవన శైలి విధానాలు, ఆహారపు అలవాట్లు ఆరోగ్యం పై ఎక్కువగా ప్రభావం చూపుతాయి. అనారోగ్యమైన ఫుడ్ హ్యాబిట్స్(Food Habits) అతి తక్కువ వయసులోనే ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, అజీర్ణం వంటి జీవ శైలి సమస్యలకు కారణమవుతాయి. ముఖ్యంగా శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడంలో మనం తీసుకునే డైట్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. మంచి కొవ్వులు, చెడు కొవ్వులు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైనప్పుడు ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి కొన్ని ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటిస్తే చాలు. ఇంట్లోనే సహజంగా తయారు చేసే ఈ ఆకుకూర పచ్చళ్ళ(Green Chutneys) తో కొలెస్ట్రాల్ తగ్గించవచ్చు.

కొలెస్ట్రాల్ తగ్గించడానికి సహాయపడే గ్రీన్ చట్నీస్

పుదీనా చట్నీ

పుదీనాలోని క్లోరోఫిల్ అధిక ఫైబర్ శాతాన్ని కలిగి ఉంటుంది. దీనిలోని ఫైబర్ శరీరంలో అధిక కొవ్వులను తగ్గించడానికి సహాయపడును. రోజు తినే ఆహారంలో పుదీన ఆకులతో చేసిన చట్నీ మీ డైట్ లో చేర్చుకుంటే ఆరోగ్యం మంచి ప్రభావం ఉంటుంది.

మెంతికూర చట్నీ

శరీరంలో కొవ్వులను తగ్గించడానికి మెంతి ఆకుల చట్నీ ఒక మ్యాజిక్ లా పనిచేస్తుంది. మెంతి ఆకులోని పుష్కలమైన పోషకాలు ఉంటాయి. వీటిలోని ప్రోటీన్, విటమిన్ C, A, కాల్షియం, ఐరన్, పొటాషియం చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించును.

పాలకూర చట్నీ

పాలకూరలోని కెరోటినాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో చెడు కొవ్వులను తగ్గించడానికి ప్రభావితంగా పనిచేస్తాయి. అంతే కాదు వీటిలోని పోషకాలు జీర్ణక్రియ సమస్యలను కూడా తగ్గించును.

కరివేపాకు చట్నీ

అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడే వారికి కరివేపాకు ఆకులు అద్భుతమైన ఎంపిక. కరివేపాకు ఆకులోని యాంటీ ఆక్సిడెంట్స్.. చెడు కొలెస్ట్రాల్ పెరుగుదలకు కారణమయ్యే కొవ్వులు ఆక్సీకరణను తగ్గించును. ఇది శరీరంలో మంచి కొవ్వులు పెరుగుదలకు సహాయపడును.

Also Read: Health Tips : ఉదయం లేవగానే తలనొప్పిగా ఉందా.. అయితే మీకు సమస్యలు ఉన్నట్లే..?

Advertisment
Advertisment
తాజా కథనాలు