Dr YSR Aarogyasri: ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తె కఠిన చర్యలు!

ఏపీలోని ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తె కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓ డాక్టర్‌ లక్ష్మిషా. పెండింగ్ బకాయిల్లో రూ.203 కోట్ల రూపాయలు ఈరోజు విడుదల చేశామని.. మిగిలిన బకాయిలు కూడా త్వరలోనే చెల్లించనున్నట్లు చెప్పారు.

New Update
Dr YSR Aarogyasri: ఆరోగ్యశ్రీ  సేవలు నిలిపివేస్తె కఠిన చర్యలు!

Dr YSR Aarogyasri: ఏపీలోని ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తె కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓ డాక్టర్‌ లక్ష్మిషా. అన్ని నెట్వర్క్ హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించాలని అన్నారు. కొనసాగించని హాస్పిటల్స్ పై చర్యలు తీసుకుంటాం అని పేర్కొన్నారు. పెండింగ్ బకాయిల్లో రూ. 203కోట్ల రూపాయలు ఈరోజు విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ. 366 కోట్లు విడుదల చేశామని అన్నారు. నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ సభ్యులతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నామని.. మిగిలిన బకాయిలు కూడా త్వరలోనే చెల్లించనున్నట్లు చెప్పారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు