Movie Tickets: సినీ లవర్స్ కి బంపరాఫర్.. రూ.99 కే టికెట్ కానీ తెలంగాణలో మాత్రం షరతులు వర్తిస్తాయి! పీవీఆర్ మల్టీప్లెక్స్ సినిమా లవర్స్ డేని దృష్టిలో ఉంచుకుని శుక్రవారం నాడు రూ. 99 లకే టికెట్లను విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ అవకాశం ఏపీ, తమిళనాడు, కేరళలో మాత్రమే. తెలంగాణలో పీవీఆర్ ఐనాక్స్ లో రూ. 112 కు టికెట్లను విక్రయిస్తున్నట్లు తెలిపారు. By Bhavana 22 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి తమ అభిమాన హీరోల సినిమాలు (Movies) విడుదల అవుతున్నాయంటే టికెట్ (Ticket) ధర ఎంతైనా పెట్టి చూసేందుకు రెడీ గా ఫ్యాన్స్. అందుకే హీరోని బట్టి థియేటర్ల యజమానులు కూడా టికెట్ రేట్లను పెంచుతూంటారు. దాదాపు ఒక్కో టికెట్ 500 - 700 వరకు రేట్లు పెంచి క్యాష్ చేసుకుంటుంటారు. భారీ బడ్జెట్ సినిమాలు, పెద్ద హీరోల సినిమాలకు ఇది కామన్. లేకపోతే మాకు నష్టాలు వస్తాయని సినీ నిర్మాతలు వాపోతుంటారు. సాధారణ బడ్జెట్ తో తీసిన సినిమాలకు ప్రభుత్వం డిసైడ్ రేట్లకే టికెట్లను విక్రయిస్తుంటారు. ఈ క్రమంలో సినీ లవర్స్ కి ఓ బంపరాఫర్ ప్రకటించింది ఓ మల్టీప్లెక్స్ కంపెనీ. '' ఫిబ్రవరి 23 సినిమా లవర్స్ డే'' (Cinema Lovers Day) ని దృష్టిలో పెట్టుకుని కేవలం రూ. 99 లకే టికెట్‌ని సినీ లవర్స్ కు అందించాలని నిర్ణయం తీసుకుంది. కేవలం శుక్రవారం ఒక్కరోజు మాత్రమే రూ. 99 లకి టికెట్ ను అందించబోతున్నట్లు ప్రకటించింది. మల్టీప్లెక్స్ స్క్రీన్లలోని ఏ సినిమాకైనా ఈ ధర వర్తిస్తుందని వివరించింది. ఈ అవకాశం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో వర్తిస్తుందని.. తెలంగాణలో మాత్రం పీవీఆర్ ఐనాక్స్ లో రూ. 112 కు టికెట్లను విక్రయిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో మాత్రం 13 రూపాయలు ఎక్కువగా విక్రయించడం సినీ లవర్స్ కి పెద్ద ట్విస్టే. అసలు విషయం ఏంటంటే ఈ నెలలో అసలు తెలుగు సినిమాలు పెద్దగా విడుదల కావడం లేదు. అందుకే సినిమా టికెట్ల రేట్లు తగ్గించి సినీ లవర్స్ ని థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేస్తుంది పీవీఆర్ ఐనాక్స్. మరీ శుక్రవారం నాడు ఎంతమంది మల్టీప్లేక్స్ లకు క్యూ కడతారో వేచి చూడాలి. Also read: ఇంట్లోనే నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నం..అధిక రక్తస్రావంతో తల్లీబిడ్డ మృతి! #rates #99-rupees-only #pvr-multiplex #cinema-lovers-day మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి