Rath Yatra: పూరీ జగన్నాధ యాత్రలో అపశ్రుతి.. విగ్రహం కిందపడి ఏడుగురికి గాయాలు 

పూరీలో రథయాత్ర అనంతరం మంగళవారం బలభద్ర విగ్రహం పడిపోవడంతో ఏడుగురు భక్తులకు గాయాలు అయ్యాయి. మూడు దేవతా విగ్రహాలను రథంపై నుంచి గుండిచా ఆలయంలోని అడపా మండపానికి తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

New Update
Rath Yatra: పూరీ జగన్నాధ యాత్రలో అపశ్రుతి.. విగ్రహం కిందపడి ఏడుగురికి గాయాలు 

Rath Yatra: ఒడిశాలోని పూరీలో రథయాత్ర అనంతరం జరిగిన కార్యక్రమంలో బలభద్ర స్వామి విగ్రహం కిందపడిపోవడంతో ఏడుగురు భక్తులు గాయపడ్డారు. రథయాత్ర పూర్తయిన తరువాత మంగళవారం సాయంత్రం మూడు విగ్రహాలను రథంపై నుంచి గుండిచా ఆలయంలోని అడపా మండపానికి తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

ఒడిశాలోని పూరీలో తొలి దశ రథయాత్ర ఉత్సవాలు ముగియడంతో తోబుట్టువుల దేవతలైన జగన్నాథ, బలభద్ర, దేవి సుభద్రల రథాలు సోమవారం గుండిచా ఆలయానికి చేరుకున్నాయి.

Rath Yatra: ఇతర ఆచారాలు ముగిసిన తరువాత, విగ్రహాల 'పహండి' ప్రారంభమైంది. అక్కడ మూడు విగ్రహాలను సేవకులు నెమ్మదిగా రథంలో అడపా మండపానికి తీసుకెళ్లారు. తాళధ్వజ అనే రథంపై నుంచి బలభద్రుడి విగ్రహాన్ని తీసుకెళ్తుండగా, ఆ విగ్రహం రథం నేలపై నుంచి జారి సేవకుల మీద పడింది.

Rath Yatra: వెంటనే రెస్క్యూ సిబ్బంది, ఇతర సేవకులు సంఘటనా స్థలానికి చేరుకుని విగ్రహాన్ని పైకి లేపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. 2 రోజుల రథయాత్రలో రద్దీ కారణంగా ఆదివారం, సోమవారం వరుసగా ఒక్కొక్కరు మరణించారు. అలాగే పలువురు గాయపడ్డారు.

వేలాది మంది ప్రజలు రథాలు లాగుతుండగా, లక్షలాది మంది భక్తులు రథోత్సవాన్ని వీక్షించేందుకు రోడ్డు పక్కన గుమిగూడారు. ఆదివారం నుంచి రథయాత్ర ప్రారంభమైంది. గ్రాండ్ రోడ్‌లోని గుండిచా ఆలయం వెలుపల మూడు అద్భుతమైన రథాలు ఉన్నాయి. మంగళవారం స్వామివారిని శాస్త్రోక్తంగా ఆలయంలోకి తీసుకెళ్లారు. ఈ ఆలయంలో దేవతలు ఒక వారం పాటు ఉంటారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు