గోదావరికి పెరుగుతున్న వరద ఉదృతి.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులూ వంకలూ పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రోడ్లు కొట్టుకుపోతున్నాయి. భారీ వర్షాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో అధికారులు అలెర్ట్‌ అయ్యారు. గంట గంటకూ గోదావరీ నిటిమట్టం పెరుతుండటంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరుకుందని అధికారులు తెలిపారు. మత్య్సకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని సూచించారు.

New Update

మరోవైపు గోదావరి ఉదృతి అంతకంతకూ పెరుగుతుండటంతో.. రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ముందస్తు జాగ్రత్తగా సమీప గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారికి ప్రభుత్వం అన్ని విధాలా ఏర్పాటు చేసింది. దీంతో వేల సంఖ్యలో నదీ పరివాహక ప్రాంత ప్రజలు తత్కాలికంగా ఏర్పాటు చేసిన శిబిరంలో తల దాచుకుంటున్నారు. కాగా మరికొన్ని వరద ప్రభావిత గ్రామలకు ప్రస్తుతం వరద వెళ్లకపోవడంతో ప్రజలు ఏమవుతుందిలే అనే ఉద్దేశంతో ఇళ్లను వదిలి రావడంలేదు. గతంలో పోలవరం ప్రాజెక్ట్ వల్ల సమీప ప్రాంతాలకు చెందిన గ్రామాలు దాదాపు నెల రోజుల పాటు వరదల్లో నానాయి.

ప్రజలు దానిని మరవక ముందే మరో సారి వరద ప్రవాహం వస్తుంది. గతంలో జరిగిన నష్టాన్ని ప్రజలు దృష్టిలో పెట్టుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎన్టీఆర్ఎఫ్‌ సిబ్బంది మీకు పూర్తిగా సహకారం అందిస్తుందని, ముంపు ప్రాంత ప్రజలు తొందరగా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం 43 అడుగులకుచేరుకున్న గోదావరి నీటి ప్రవాహం రాత్రి వరకు 46 అడుగులకు చేరుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు