AP: నాకు న్యాయం చేయండి.. ప్రియుడి కోసం ప్రియురాలి పోరాటం..!

ఏలూరు జిల్లా భీమడోలులో తన ప్రియుడి కోసం ఓ ప్రియురాలు ఆందోళన చేపట్టింది. పొలాసానిపల్లికు చెందిన రావికుమార్(25) పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి, ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని యువతి ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనకు న్యాయం చేయాలని నిరసన చేపట్టింది.

New Update
AP: నాకు న్యాయం చేయండి.. ప్రియుడి కోసం ప్రియురాలి పోరాటం..!

West Godavari: పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి తనను శారీరకంగా వాడుకొని, ఇప్పుడు పెళ్లికి నిరాకరించాడని ఓ ప్రియురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. 'నాకు న్యాయం చేయండి' అంటూ అధికారులను వేడుకున్నా ఫలితం కనిపించడం లేదని బాధిత యువతి కన్నీటి పర్యంతం చెందుతుంది.

ఏలూరు జిల్లాలో పొలాసానిపల్లిలో ఈగలాటి రావికుమార్ (25) తనను ప్రేమించానని నమ్మించి, తనను శారీరకంగా వాడుకున్నాడని, ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే నిరాకరిస్తున్నాడని భీమడోలు గ్రామానికి చెందిన యువతి నాగేశ్వరి (24) తన బాధను చెప్పుకుంది. తనతో కొన్నాళ్ళు సహజీవనం చేసి ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవట్లేదని బాధిత యువతి చెప్తోంది.

Also Read: గ్యాంగ్ సినిమా తరహాలో ఫుడ్ ఇన్ స్పెక్టర్లమంటూ రైడ్.. చివరికి ఏం జరిగిందంటే?

దీనిపై రెండు నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించట్లేదంటూ నాగేశ్వరి వాపోయింది. ఇదేంటని రవికుమార్ ఇంటికి వెళ్లి అడిగితే తనను చంపేస్తామని రవికుమార్ కుటుంబ సభ్యులు బెదిరిస్తున్నారని తెలిపింది. భీమడోలు పోలీసులు ఎఫైఆర్ నమోదు చేసినా కూడా ఇప్పటివరకు రవికుమార్ అతని కుటుంబ సభ్యులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని నాగేశ్వరి తెలిపింది.

కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్లే తనను రవికుమార్ కాదంటున్నాడని బాధిత యువతి చెబుతోంది. రవికుమార్ ఇంటికి వెళ్లి అడిగితే.. నువ్ తక్కువ కులం దానివని మాకు సరిపడవని, తనని ఇంట్లోంచి గెంటేశారని యువతి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయం బయటకు చెబితే రవికుమార్ అన్న, వదిన.. తనను చంపేస్తామని బెదిరించారంటోంది నాగేశ్వరి. పోలీసులు స్పందించి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది. నాకు న్యాయం కావాలని పోరాటం చేస్తున్నా నాగేశ్వరికి దళిత సంఘాలు మద్దతుగా నిలిచాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు