Health Tips:అల్లం నీరు vs అల్లం టీ..ఆరోగ్యానికి ఏది మంచిది?

అల్లం టీ తాగుతుంటే ఆ రిలాక్సే వేరు. అయితే .అల్లం టీ ఎక్కువగా తాగడం వల్ల ఏమయినా ఆరోగ్యపరమైన ఇబ్బందులున్నాయా?, మరి అల్లం నీరు తాగితే మంచిదా .. అల్లం టీ తాగడం మంచిదా అనే విషయాలను తెలుసుకుందాం.

New Update
Health Tips:అల్లం నీరు vs అల్లం టీ..ఆరోగ్యానికి ఏది మంచిది?

Health Tips:కరోనా పాండమిక్ సమయంలో అల్లం విలువా చాలా మందికి తెలిసింది.రోగ నిరోధక శక్తిని పుష్కలంగా ఇచ్చే ఈ అల్లం ప్రతీ రోజు మనం టీ లో , ఆహారాల్లో తీసుకుంటూ ఉంటాం. ఆరోగ్య సమస్యలను సహజంగా తగ్గించే విషయంలో అల్లం విజయం సాధిస్తుంది. అయితే .. అల్లం టీ ఆరోగ్యానికి మంచిదా ? అల్లం నీరు మంచిదా అనే విషయాలపై చాలా మందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి.
అల్లం టీ: యాంటీ ఆక్సిడెంట్ హౌస్
పనుల ఒత్తిడి సమయంలో చాలా రిలాక్స్ నిచ్చే అల్లం టీ మిగిన వాటితో పోటీ ఏమాత్రం కాదు.  అల్లం టీని ఒక ఛాంపియన్ గా పరిగణించవచ్చు.  ముఖ్యంగా గ్రీన్ టీతో పోల్చినప్పుడు. యాంటీఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో నిండిన ఈ స్పైసీ మిశ్రమం వివిధ ఆరోగ్య పరిస్థితులకు  రెమెడీగా ఉంటుంది. అయితే ఆగండి, ఒక ట్విస్ట్ ఉంది! అల్లం టీ వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి.  చాలా ఎక్కువ గ్యాస్, ఉబ్బరం మరియు వాత ప్రేరిత ఇబ్బందులకు  ,ఆందోళన వంటి వాటికీ దారితీస్తుందని అంటున్నారు.
పొడి అల్లం నీరు వల్ల చాలా లాభాలు 
ఆ వాత ప్రేరిత ఇబ్బందులకు ఎండిన అల్లం నీరు సూపర్ హీరోగా పని చేస్తుంది. హిందీలో సుంఠి లేదా సోంత్ కా పానీ అని ముద్దుగా పిలవబడే పొడి అల్లం పొడి నుండి తయారైన ఈ పానీయం సమతుల్య జీర్ణ వ్యవస్థకు ఎంతగానో ఉపయోగపడుతుంది.  ఉబ్బరం నుండి ఉపశమనం పొందేందుకు ప్రయోజనకారిగా ఉంటుంది. పొడి అల్లం నీరు కూడా మీ రహస్య ఆయుధంగా ఉండవచ్చు, జీవక్రియను పెంచడమే కాకుండా చిరుతిళ్ల నుంచి దూరంగా ఉంచుతుంది.
తాజా అల్లం నీరు
అల్లం నీరు జలుబు,దగ్గు నుంచి తొందరగా ఉపశమనాన్ని ఇస్తుంది.  తాజా అల్లం నీరు మీ హృదయానికి మేలు చేస్తుంది.  రక్త నాళాల మెరుగైన పనితీరుతో ఆరోగ్యవంతంగా ఉంచటమ కాక రక్తపోటును తగ్గిస్తుంది. ఒక చిటికెడు తేనె లేదా నిమ్మకాయ పిండి మీ అల్లం పానీయాన్ని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ పని తీరు బాగుంటుంది. పొడి అల్లం నీరు గ్యాస్ మరియు ఉబ్బరం వంటి వాత సంబంధిత సమస్యలను పరిష్కరిస్తుంది.

(గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.)

Also Read:కళ్ళ కింద నల్లని వలయాలున్నాయా? ఇలా చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది

Advertisment
Advertisment
తాజా కథనాలు