కేసీఆర్ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవటం లేదు.. సమ్మెకు దిగిన అవుట్ సోర్సింగ్ కార్మికులు

జీహెచ్ఎంసీ అవుట్ సోర్సింగ్ కార్మికులు రోడ్డెక్కారు. అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న కార్మికులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని.. పర్మినెంట్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి జీహెచ్ఎంసీ శానిటేషన్ కార్మికులు సమ్మె బాట పట్టారు. దీంతో వేలాది మంది కార్మికులను పోలీసులు ఎక్కడికక్కడే అరెస్ట్ చేస్తున్నారు...దీని పై సీరియస్ అయిన కార్మికులు సచివాలయం ముట్టడిస్తామంటున్నారు..

New Update
కేసీఆర్ ప్రభుత్వం  మమ్మల్ని పట్టించుకోవటం లేదు..  సమ్మెకు దిగిన  అవుట్  సోర్సింగ్ కార్మికులు

GHMC outsourcing workers Strike: జీహెచ్ఎంసీ అవుట్ సోర్సింగ్ కార్మికులు రోడ్డెక్కారు. అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న కార్మికులకు సీఎం కేసీఆర్ (CM KCR) ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని.. పర్మినెంట్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి జీహెచ్ఎంసీ శానిటేషన్ కార్మికులు సమ్మె బాట పట్టారు. దీంతో వేలాది మంది కార్మికులను పోలీసులు ఎక్కడికక్కడే అరెస్ట్ చేస్తున్నారు.

ఎక్కడి చెత్త అక్కడే..!

నగరంలో స్వీపింగ్ ఇంకా చెత్తను తరలించే విధులను జీహెచ్ఎంసీ (GHMC) కార్మికులు బహిష్కరించడంతో ఎక్కడి చెత్త అక్కడే పడి ఉంది. శానిటేషన్ పని స్తంభించిపోయింది. ఎల్బీనగర్, లోయర్ ట్యాంక్ బండ్, చాదర్ ఘాట్, యూసుఫ్ గూడాలతో పాటు పలు చెత్త డంపింగ్ ప్లేసుల్లో కార్మికులు నిరసనకు దిగారు. దీంతో చెత్త ట్రాన్స్ ఫర్ స్టేషన్ల దగ్గరే వేలాది మంది శానిటేషన్ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు.

సచివాలయం ముట్టడిస్తాం..!

ఇక ఈ అరెస్టులపై గ్రేటర్ హైరదాబాద్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ మండిపడుతోంది. దీనికి నిరసనగా సాయంత్రం వరకు సచివాలయాన్ని ముట్టడిస్తామని గ్రేటర్ హైరదాబాద్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రెసిడెంట్ ఊదరి గోపాల్ అన్నారు. వెంటనే సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకొని..జీహెచ్ఎంసీలో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

Also Read: చిరంజీవి మోకాలికి ఆపరేషన్ పూర్తి.. ఈనెల 20న హైదరాబాద్‌కు రాక

Advertisment
Advertisment
తాజా కథనాలు