Ugadi Special Recipes: ఉగాది రోజు ఈ పిండి వంటలు తినాల్సిందే..ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా? ఉగాదికి పిండి వంటలు చేసుకోవడం సంప్రదాయబద్దంగా వస్తోంది. చేసుకున్న వంటకాలన్నీ పండగ రోజు దేవుడికి నైవేద్యంగా సమర్పించి ఈ కొత్త సంవత్సరంలో అన్ని సవ్యంగా జరగాలని కోరుకుంటారు. ఆ పిండివంటలేవో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి. By Bhoomi 07 Apr 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Ugadi Special Recipes: ఉగాది..తెలుగువారి పండుగ. పల్లెల నుంచి విదేశాల్లో ఉన్న తెలుగువారంతా ఉగాది ఘనంగా జరుపుకుంటారు. ఉగాదిని అందరూ ఒకే రకంగా జరుపుకుంటారు. చిన్న చిన్న తేడాలుంటాయంతే తప్పా మిగితాదంతా కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది. ఉగాది పండగ రోజు మనం చేసుకునే పిండి వంటలేవో తెలుసుకుందాం. ఉగాదికి పిండి వంటలు చేసుకోవడం సంప్రదాయబద్దంగా వస్తోంది. చేసుకున్న వంటకాలన్నీ పండగ రోజు దేవుడికి నైవేద్యంగా సమర్పించి ఈ కొత్త సంవత్సరంలో అన్ని సవ్యంగా జరగాలని కోరుకుంటారు. ఉగాది స్పెషల్ పిండి వంటలు అవేంటో చూద్దాం. పూర్ణం బూరెలు: కావాల్సిన పదార్థాలు: శనగపప్పు - 1 కప్పు బెల్లం తురుము -1 కప్పు ఇలాచీ పొడి- అర టీస్పూన్ నెయ్యి- సరిపడా మినపపప్పు-1టేబుల్ స్పూన్ బియ్యం -2 టేబుల్ స్పూన్స్ ఉప్పు -చిటికెడు నూనె - సరిపడా తయారీ విధానం: శనగపప్పుును రెండు గంటలు నానబెట్టి రుబ్బుకోవాలి. దాన్ని తడిపిన బియ్యంపిండిలో వేసి కొంచెం ఉప్పు కలిపి గంటసేపు నానబెట్టాలి. శెనగపప్పును ఉడికించాలి. నీళ్లు వడగట్టి ఆ పప్పులో బెల్లం తురుము వేసి రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యిలో వేగించి చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. వీటిని పిండిలో ముంచి మరుగుతున్న నూనెలో దోరగా వేయించుకోవాలి. చాలా ప్రాంతాల్లో పూర్ణం బూరెలను ఉగాది స్పెషల్ గా చేసుకుంటారు. భక్ష్యాలు: కావాల్సిన పదార్థాలు: మైదాపిండి లేదా గోధుమ పిండి -2 కప్పులు నెయ్యి - సరిపడా ఉప్పు- చిటికెడు జీడిపప్పు పొడి- అరకప్పు బాదంపప్పు పొడి -అరకప్పు అంజీర్ -అరకప్పు ఎండు కొబ్బరి తురుము - అరకప్పు ఇలాచీ పొడి -పావు టీస్పూన్ బెల్లం తురుము - అరకప్పు తయారీ విధానం: ఒక గిన్నెలో మైదా లేదా గోధుమ పిండి , ఉప్పు, ఒక టీ స్పూన్ నెయ్యి, సరిపడా నీళ్లు పోసి మెత్తగా కలుపుకోవాలి. మరో గిన్నెలో జీడిపప్పు, బాదం పొడి, అంజీర్, ఎండుకొబ్బరి తురుము, ఇలాచీ పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. తర్వాత పిండిని కొద్ది కొద్దిగా తీసుకుని పూరీల్లా వత్తుకోవాలి. వాటి మధ్యలో డ్రైఫ్రూట్స్ మిశ్రమం పెట్టి ఉండగా చేసుకోవాలి. వీటిని చేతితో లేదా చపాతీ కర్రతో వత్తుకోవాలి. పెనంపై వాటిని నూనె లేదా నెయ్యితో రెండు వైపులా కాల్చుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ భక్ష్యాలను నెయ్యితో నంజుకుంటే రుచిగా ఉంటాయి. ఇది కూడా చదవండి: వాంఖడే స్టేడియంలో భారీ తప్పిదం.. ఢిల్లీ క్యాపిటల్స్ తీవ్ర ఆగ్రహం! #ugadi-special-recipes మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి