ఈ క్రికెటర్ల వారసులు ఏం చేస్తున్నారో తెలుసా?

భారత క్రికెట్ లో సచిన్, గంగూలీ, ద్రవిడ్,సెహ్వాగ్, గంభీర్ చెరగని ముద్ర వేశారు. అయితే వారు క్రికెట్ నుంచి రిటైరైన తర్వాత కొంతమంది,కోచ్ లగా వ్యాఖ్యాతలగా,బ్రాండ్ అంబాసిడర్ల గా స్థిరపడ్డారు. ప్రస్థుతం వారి సంపాదన,వారసులు ఏం చేస్తున్నారో ఈ ఆర్టికల్ లో చూద్దాం.

New Update
ఈ క్రికెటర్ల వారసులు ఏం చేస్తున్నారో తెలుసా?

సచిన్ టెండూల్కర్: గాడ్ ఆఫ్ క్రికెట్ అని పిలుస్తారు, అతని నికర విలువ దాదాపు 1250 కోట్ల రూపాయలు. క్రికెట్‌తో పాటు పలు కంపెనీలకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ పలు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి  సంపాదించారు. అతని కుమార్తె సారా టెండూల్కర్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. సారా లండన్ విశ్వవిద్యాలయం నుండి వైద్య పట్టభద్రురాలు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 6.6 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. 2023 నాటికి, సారా నికర విలువ దాదాపు రూ. 1 కోటి వరకు ఉంది.కొడుకు అర్జున్ టెండూల్కర్  తండ్రి బాటలో క్రికెటర్‌గా నడుస్తున్నాడు. అర్జున్ టెండూల్కర్ 2018లో శ్రీలంకపై U-19 అరంగేట్రం చేశాడు. అతను ఐపీఎల్ లో ముంబై తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

సౌరవ్ గంగూలీ: భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నికర సంపద రూ.634 కోట్లు. అతను క్రికెట్ నుండి రిటైర్మెంట్ తర్వాత, క్రికెట్ వ్యాఖ్యాత గా.బీసీసీఐ సెలెక్టర్ గా బాధ్యతలు నిర్వహించాడు. అతని కుమార్తె సనా గంగూలీ  క్రికెట్ మ్యాచ్‌లలో ప్రేక్షకురాలిగా తరచుగా కనపడుతుంది.

రాహుల్ ద్రవిడ్: రాహుల్ ద్రవిడ్ నికర విలువ రూ. 320 కోట్లు. రిటైర్మెంట్ తర్వాత భారత జట్టులో కోచ్‌గా చేరాడు. అతని కుమారులు సమిత్, అన్వే ద్రవిడ్ క్రికెట్ ప్రపంచంలో తమదైన ముద్ర వేశారు. వీరిలో అన్వే కర్ణాటకలోని అండర్-14 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. రాహుల్ ద్రవిడ్ కూడ కర్ణాటక జట్టుకు కెప్టెన్‌గా  అండర్-15, అండర్-17, అండర్-19 కూడా వ్యవహరించాడు.

వీరేంద్ర సెహ్వాగ్: సెహ్వాగ్ నికర విలువ రూ.300 కోట్లు. క్రికెట్‌తో పాటు పలు పరిశ్రమల్లో కూడా పెట్టుబడులు పెట్టాడు. అతని కుమారులు ఆర్యవీర్, వేదాంత్ క్రికెట్‌పై ఆసక్తితో శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గౌతమ్

గంభీర్: అతని నికర విలువ 147 కోట్ల రూపాయలు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టాడు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు.

Advertisment
Advertisment
తాజా కథనాలు