దుండగుడి చేతిలో ప్రాణాలు కోల్పొయిన శ్రీలంక మాజీ క్రికెటర్! శ్రీలంక మాజీ క్రికెటర్ ధమ్మిక నిరోషన ఓ దుండగుడి చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. భార్యా పిల్లల ఎదుటే గుర్తు తెలియని వ్యక్తి నిరోషనను కాల్చి చంపాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి శ్రీలంకలోని అంబలంగోడలోని అతడి నివాసంలో చోటు చేసుకుంది.కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. By Durga Rao 17 Jul 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి ధమ్మిక గాలె జిల్లాలోని అంబాలన్‌గోడా ప్రాంతంలో కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నాడు. గత రాత్రి ఓ దుండగుడు అతడి ఇంట్లోకి ప్రవేసించి దాడి చేశాడు. భార్య, ఇద్దరు పిల్లల ముందే తుపాకీతో నిరోషన ను అతి దారుణంగా కాల్చి చంపాడు. కాల్పుల అనంతరం దుండగుడు ఇంట్లో నుంచి పారిపోయాడు.అయితే మృతుడి భార్య,పిల్లలకు నిందితుడు ఎటువంటి హానీ చేయలేదు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపుచర్యలు చేపట్టారు. ధమ్మిక నిరోషన 2000 సంవత్సరంలో శ్రీలంక అండర్-19 జట్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు. రెండేళ్ల పాటు శ్రీలంక జూనియర్ జట్టుకు వన్డేలు, టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 12 మ్యాచ్‌లు, లిస్ట్-ఏలో 8 మ్యాచ్‌లు ఆడాడు, వరుసగా 19, 5 వికెట్లు పడగొట్టాడు..కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల 20 ఏళ్లకే క్రికెట్‌ను వదిలేశాడు. శ్రీలంకలోని చిలావ్ మారియన్స్ క్రికెట్ క్లబ్, గాలే క్రికెట్ క్లబ్, సింఘా స్పోర్ట్స్ క్లబ్‌లకు ప్రాతినిధ్యం వచించాడు. అలాగే శ్రీలంకలోని చిలావ్ మారియన్స్ క్రికెట్ క్లబ్, గాలే క్రికెట్ క్లబ్, సింఘా స్పోర్ట్స్ క్లబ్‌లకు ప్రాతినిధ్యం వచించాడు. #sri-lankan-cricketer మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి