Ananthapuram: తెలంగాణలో 24 గంటలు కరెంట్..మన రాష్ట్రంలో నాలుగైదు గంటలకు కూడా లేదు: మాజీ ఎమ్మెల్యే ఏపీలో నాలుగైదు గంటలు కూడా కరెంటు సరఫరా కావడం లేదన్నారు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ. విద్యుత్ కోతలతో రైతాంగం తల్లడిల్లుతుంటే సొంత ఖర్చులతో బోర్ల రిపేరు చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రజలు దాహం.. దాహం అంటూ అల్లాడిపోతున్నారని వ్యాఖ్యానించారు. By Jyoshna Sappogula 28 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ అనంతపురం New Update షేర్ చేయండి Former MLA Gonuguntla Suryanarayana: విద్యుత్ కోతల కారణంగా ధర్మవరం నియోజకవర్గంలోని రైతాంగం కోట్లాది రూపాయల విలువ చేసే పంటలను నష్టపోయే పరిస్థితి వచ్చిందని మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ. ఇది ముమ్మాటికి ప్రభుత్వ దారుణ వైఫల్యమేనని మండిపడ్డారు. రోజుకు కనీసం నాలుగైదు గంటలు విద్యుత్ సరఫరా అవుతోందని, అది కూడా సక్రమంగా సరఫరా కావడం లేదని అన్నారు. అంతేకాక లో ఓల్టేజి కారణంగా వందల సంఖ్యలో విద్యుత్ మోటార్లు కాలిపోతున్నాయని ఆయన పేర్కొన్నారు. Also Read: క్యాడ్‌బరీ డైరీమిల్క్ చాలా ప్రమాదం.. నిర్దారించిన తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబరేటరీ! పక్క రాష్ట్రమైన తెలంగాణలో 24 గంటలు విద్యుత్ సరఫరా అవుతోందని, కనీసం మన రాష్ట్రంలో నాలుగైదు గంటలకు కూడా కరెంటు సరఫరా కావడం లేదని చెప్పుకొచ్చారు. ఎన్నికలకు ముందు రోజుకు 9 గంటల నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేస్తామని హామీ ఇచ్చి తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు. 2014 -2019 తెలుగుదేశం పాలనలో సీఎం చంద్రబాబు రోజుకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అంతేకాక ధర్మవరం నియోజకవర్గం లోని ప్రజలు దాహం.. దాహం అంటూ తల్లడిల్లి పోవాల్సి వస్తోందన్నారు. గత ఏడాది తీవ్ర వర్షాభావం కారణంగా భూగర్భ జలాలు అడుగంటిపోయి తాగునీటి బోర్లు ఎండిపోయాయన్నారు. వేసవికాలం ప్రారంభమైనప్పటికీ ప్రజలకు తాగునీటిని అందించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విరుచుకుపడ్డారు. Also Read: చంద్రబాబు ఆసక్తికర ట్వీట్.. భువనేశ్వరి రియాక్షన్ చూడండి..! ఇటీవల సత్యసాయి జిల్లా కలెక్టర్ ను తాను కలిసి సమస్యను పరిష్కరించాలని కోరానన్నారు. ఆయన కొంతమేర స్పందించి మంచినీటి బోర్లను రిపేరు చేయించారన్నారు. నియోజకవర్గంలో ఇంకా చాలా బోర్లు, మంచినీటి పథకాల మోటార్లు కాలిపోయి ఉన్నాయన్నారు. తన సొంత ఖర్చులతో నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న బోర్లను రిపేరు చేయించడంతోపాటు, కాలిపోయిన మోటార్లను రిపేరు చేయించే కార్యక్రమాన్ని ప్రారంభించానన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి తక్షణం ప్రజలకు తాగునీటి అందించేందుకు అవసరమైన నిధులను విడుదల చేయాలని గోనుగుంట్ల డిమాండ్ చేశారు #former-mla-gonuguntla-suryanarayana మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి