కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ కన్నుమూత..!! కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఊమెన్ చాందీ కన్నుమూశారు. తన తండ్రి మరణాన్ని ఊమెన్ చాందీ కుమారుడు వెల్లడించారు. ఉమెన్ చాందీ కేరళకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. 1970 నుంచి రాష్ట్ర అసెంబ్లీకి పుత్తుపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 నుంచి ఆయన అనారోగ్య సమస్యలో బాధపడుతున్నారు. By Bhoomi 18 Jul 2023 in నేషనల్ Scrolling New Update షేర్ చేయండి కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఊమెన్ చాందీ కన్నుమూశారు. తన తండ్రి మరణాన్ని ఊమెన్ చాందీ కుమారుడు వెల్లడించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఊమెన్ చాందీ ఈరోజు తుది శ్వాస విడిచారు. ఉమెన్ చాందీ మృతి పట్ల కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు కె. సుధాకరన్ ట్వీట్ చేస్తూ సంతాపం వ్యక్తం చేశారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఊమెన్ చాందీ కన్నుమూశారని ఆయన ట్వీట్ చేశారు. ప్రేమ శక్తితో ప్రపంచాన్ని జయించిన రాజు కథకు పదునైన ముగింపు అంటూ ట్వీట్ చేశారు. ఈరోజు ఓ మహానుభావుడి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాను. అతను లెక్కలేనన్ని వ్యక్తుల జీవితాలను ప్రభావితం చేశాడు, అతని వారసత్వం మన ఆత్మలలో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తుందని సుధాకరన్ అన్నారు. https://twitter.com/SudhakaranINC/status/1681097138560962560?s=20 2019 నుండి ఊమెన్ చాందీ అనారోగ్యంతో బాధపడుతున్నారు. చాందీకి గొంతు సంబంధిత వ్యాధి రావడంతో జర్మనీలో చికిత్స తీసుకున్నారు. ఆయన కేరళకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. 1970 నుంచి రాష్ట్ర అసెంబ్లీకి పుత్తుపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1943 అక్టోబర్ 31 కేరళలోని కొట్టాయం జిల్లాలోఉన్న కుమరకోమ్ గ్రామంలో జన్మించారు ఉమెన్ చాందీ. ఆయన సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి...అంచెలంచెలుగా ఎదిగారు. కేరళకు సీఎంగా ఎన్నికయ్యారు. తన నిజాయతీతో పార్టీ అధినాయకత్వానికి విశ్వాసపాత్రుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. 27 ఏ వయస్సుల్లో పూతుపల్లి నుంచి 1970లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. ఘన విజయం సాధించి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి నుంచి ఏ రోజు కూడా వెనక్కి తిరిగి చూసుకోలేదు ఉమెన్ చాందీ. ఒకటి కాదు రెండు..కాదు ఏకంగా 12సార్టు పూతుపల్లి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. తొలిసారిగా 1977లో కరుణాకరన్ మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాగా ఉమెన్ చాందీ మృతి పట్ల సంతాపం టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ప్రజానాయకులు ఉమెన్ చాందీ, ఆయన మరణం కేరళకు తీరని లోటని..ఒక గొప్ప నాయకుడిని కోల్పోయామన్నారు. రెండు సార్లు ముఖ్యమంత్రిగా నాలుగు సార్లు మంత్రిగా 12సార్లు ఎమ్మెల్యేగా దాదాపు ఐదున్నర దశాబ్దాల పాటు ప్రజాజీవితంలో చాందీ పనిచేశారని గుర్తు చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నట్లు..ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి