పాక్ కెప్టెన్ పై భారత మాజీ క్రికెటర్ ఫైర్!

పాక్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం టీ20 మ్యాచ్‌లకు ఫిట్ కాదని భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ అన్నాడు.ఇక పై నువ్వు టీ20 క్రికెట్ ఆడతావని నేను అనుకోవటం లేదని శ్రీకాంత్ తెలిపాడు.20 ఓవర్ల మ్యాచ్ లో టిక్ టిక్ అంటూ స్లో గా ఆడేవారు పనికరారని ఆయన పేర్కొన్నాడు.

New Update
పాక్ కెప్టెన్ పై  భారత మాజీ క్రికెటర్ ఫైర్!

2024 టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. భారత్, పాకిస్థాన్, యూఎస్ఏ, ఐర్లాండ్, కెనడా ఐదు జట్లతో కూడిన గ్రూప్ ఏలో భారత్, యూఎస్ఏలు తొలి రెండు స్థానాలను కైవసం చేసుకుని సూపర్ 8 రౌండ్‌లోకి దూసుకెళ్లాయి.
భారత్‌, యూఎస్‌ఏల చేతిలో ఓడిపోవడంతో పాకిస్థాన్ తదుపరి రౌండ్‌కు వెళ్లే అవకాశం లేకుండాపోయింది. దీంతో పాక్ జట్టుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కెప్టెన్ బాబార్ అజాం పై  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బాబర్ ఆజం గురించి కృష్ణమాచారి శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘బాబర్ ఆజం ఇకపై టీ20 క్రికెట్ లో నువ్వు ఆడాలని నేను అనుకోవడం లేదు.. పాక్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం టీ20 మ్యాచ్‌లకు ఫిట్ కాదని భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ అన్నాడు.ఇక పై నువ్వు టీ20 క్రికెట్ ఆడతావని నేను అనుకోవటం లేదని శ్రీకాంత్ తెలిపాడు.20 ఓవర్ల మ్యాచ్ లో టిక్ టిక్ అంటూ స్లో గా ఆడేవారు పనికరారని ఆయన పేర్కొన్నాడు. బాబర్ ఆజం విరాట్,రోహిత్ శర్మ లతో పాటు  4000 పరుగులు చేశాడని కొందరు మాజీలు అంటున్నారని..కానీ వారికో పోలిస్తే అతని స్ట్రైక్ రేట్ 112 నుండి 115  మాత్రమే ఉంది.దీంతో వారితో పోల్చటం సరికాదన్నారు.

బాబర్ ఆజంపై కూడా మరికొన్ని ఆరోపణలు ఉన్నాయి. తన స్నేహితులను పాక్ జట్టుకు ఎంపిక చేసి, వారు బాగా ఆడకపోయినా జట్టులో చోటు కల్పిస్తాడని కొందరు పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లు చెబుతున్నారు. అందుకే బాబర్‌కు అస్సాం కెప్టెన్సీ నుంచి తప్పుకునే అవకాశం ఉందని అంటున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు