Winter Foods: వింటర్ లో ఈ ఆహారాలను తక్కువగా తినాలి.. ఎందుకో తెలుసా..?

వాతావరణ మార్పులే కాదు తినే ఆహారాలు కూడా శరీర ఉషోగ్రతలపై ప్రభావం చూపుతాయి. వింటర్‌లో శరీరానికి మరింత చలిని కలిగించే కొన్ని ఆహారాలను తక్కువగా తీసుకోవాలి. వాటిలో చల్లటి పానీయాలు, పాల ఉత్పత్తులు, ఫ్రోజెన్ ఫుడ్స్, పచ్చి కూరలు, దోసకాయ ఉన్నాయి.

New Update
Winter Foods: వింటర్ లో ఈ ఆహారాలను తక్కువగా తినాలి.. ఎందుకో తెలుసా..?

Foods to Avoid in Winter: సహజంగా వింటర్ సీజన్ లో వాతావరణం చల్లగా ఉంటుంది. దీని వల్ల శరీరంలో కూడా చలి ఎక్కువగా ఉండును. వెదర్ తో పాటు మన ఆహారపు అలవాట్లు కూడా శరీర ఉష్ణోగ్రతలు ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా చలికాలంలో రోజూ తినే ఆహారంలో కొన్ని ఆహారాలను తీసుకోవడం తగ్గించాలి. ఈ ఆహారాలు శరీరంలో చలిని మరింత పెంచే అవకాశం ఉంటుంది.

వింటర్ సీజన్ లో తక్కువగా తీసుకోవాల్సిన ఆహారాలు

సహజంగానే చలికాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది. ఇలాంటి సమయంలో అదనంగా చల్లటి పానీయాలు, కూల్ డ్రింక్స్ తాగితే శరీరంలో ఉష్ణోగ్రత స్థాయిల పై ప్రభావం చూపును.

పచ్చి కూరగాయలు తగ్గించాలి

వింటర్ సీజన్ లో జీర్ణక్రియ వ్యవస్థ అంత చురుకుగ్గా పని చేయదు. ఉడకబెట్టని కూరగాయలు తింటే అవి జీర్ణమవడానికి కష్టంగా ఉండును. అందుకని పచ్చిగా కాకుండా కుక్ చేసిన లేదా స్టీమ్డ్ వెజిటేబుల్స్ తినాలి.

పాల ఉత్పత్తులు

పాల ఉత్పత్తులు ఆరోగ్యానికి ఎన్నో రకాల పోషకాలను అందిస్తాయి. కానీ డైరీ ప్రొడక్ట్స్ అతిగా తీసుకుంటే కొంత మందిలో మ్యూకస్ ఉత్పత్తిని ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. దీని వల్ల శ్వాస సమస్యలు వచ్చే ప్రమాదం ఉండును. ముఖ్యంగా చలికాలంలో పాల ఉత్పత్తులు తీసుకోవడం తగ్గించాలి.

ఫ్రిడ్జ్ లో పెట్టిన ఆహారాలు తగ్గించండి

సాధారణంగానే వింటర్ సీజన్ లో బయట వాతావరణం చల్లగా ఉంటుంది. ఈ సమయంలో శరీరానికి మరింత చలిని కలిగించే ఆహారాలను తక్కువగా తీసుకోవాలి. ఫ్రోజెన్ ఫుడ్స్, చిల్డ్ వాటర్ తగ్గించాలి.

దోసకాయ, మిలన్స్

దోసకాయ, వాటర్ మిలన్ లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిని చలికాలంలో అధికంగా తింటే శరీరం పై మరింత కూలింగ్ ఎఫెక్ట్ కలిగించును. అందుకని వీటిని తక్కువగా తీసుకోవడం మంచిది.

ఐస్ వాటర్

కొంత మందికి చలికాలంలో కూడా ఐస్ వాటర్ తాగే అలవాటు ఉంటుంది. ఇలా చేస్తే శరీర ఉష్ణోగ్రతల పై మరింత ప్రభావం చూపిస్తుంది. గోరు వెచ్చని నీళ్లు, లేదా రూమ్ ఉష్ణోగ్రత కలిగిన నీటిని తాగడానికి ప్రయత్నించండి.

లైట్ సలాడ్స్

చలికాలంలో గ్రీన్ సలాడ్, వెజిటేబుల్ సలాడ్స్, కాకుండా వేడి వేడిగా ఆరోగ్యకరమైన సూప్స్ తాగండి. హాట్ సూప్స్ తాగితే శరీరం వెచ్చగా ఉండడానికి సహాయపడును. మష్రూమ్ సూప్, చికెన్, బ్రోకలీ వంటి హెల్తీ సూప్స్ వేడి వేడి గా తాగండి.

Amla Benefits : ఉసిరి జ్యూస్ తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే! - Rtvlive.com

Advertisment
Advertisment
తాజా కథనాలు