ప్చ్! భారీ వసూళ్లు సాధించినా ఈ సినిమాలు ఫ్లాపే!!

New Update
ప్చ్!  భారీ వసూళ్లు సాధించినా ఈ సినిమాలు  ఫ్లాపే!!

Flop Movies even if they get Huge Collections: భారతీయ చలనచిత్ర ప్రపంచంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ మాత్రమే కాదు, అతిపెద్ద డిజాస్టర్లు కూడా ఉన్నాయి. ఓ సినిమాకు వసూళ్లు భారీగా కనిపించొచ్చు. కానీ దాని బడ్జెట్ తో పోల్చి చూస్తే అది ఫ్లాప్ కిందే లెక్క. నిర్మాతకు నష్టాలు తెచ్చినట్టే. ఓ ప్రముఖ బాలీవుడ్ మీడియా సంస్థ, ఇలాంటి భారీ డిజాస్టర్లను గుర్తించింది.

ఆదిపురుష్ కథ

భారతీయ చిత్ర పరిశ్రమలో భారీ డిజాస్టర్ గా నిలిచిన చిత్రం ఆదిపురుష్. రామాయణం ఆధారంగా తీసిన ఈ సినిమా, ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాకు ఏకంగా 225 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. 550 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది ఆదిపురుష్. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 325 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఈ సినిమా 300 కోట్ల క్లబ్ లో చేరిందని ఘనంగా చెప్పుకోవచ్చు కానీ బడ్జెట్ పరంగా చూసుకుంటే, బయ్యర్లకు భారీ నష్టాలు మిగిల్చింది.

ఆదిపురుష్ కు ముందు కూడా ఇండియన్ హిస్టరీలో భారీ డిజాస్టర్లున్నాయి. ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ కూడా ఈ జాబితాలోకి వస్తుంది. ఈ సినిమాకు వరల్డ్ వైడ్ 170 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ప్రభాస్-పూజాహెగ్డే జంట ఈ సినిమాను కాపాడలేకపోయింది.

డిజాస్టర్స్ లిస్ట్ లో సామ్రాట్ పృధ్వీరాజ్

ఇక భారీ డిజాస్టర్స్ లిస్ట్ లో సామ్రాట్ పృధ్వీరాజ్ సినిమా ఉంది. దీనికి 140 కోట్ల నష్టం వాటిల్లింది. ఇక షంషేరా సినిమాకు 100 కోట్లు, చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమాకు 80 కోట్లు, కన్నడ చిత్రం కబ్జా 80 కోట్లు నష్టాలు తెచ్చిపెట్టింది. ఇక లిస్ట్ లో అమీర్ ఖాన్ సినిమాలు కూడా ఉన్నాయి.

publive-image

లాల్ సింగ్ చద్దా, థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ సినిమాలదీ అదే రూటు 

అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా, థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ సినిమాలు అతిపెద్ద డిజాస్టర్ల జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. లాల్ సింగ్ చద్దా సినిమాకు ఇండియాలోనే 70 కోట్ల రూపాయల నష్టం వాటిల్లగా.. థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమాకు 60 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. ఈ సినిమాలన్నీ బయ్యర్లను భారీగా ముంచేశాయి.

Flop Movies even if they get Huge Collections

Advertisment
Advertisment
తాజా కథనాలు