కడెం ప్రాజెక్ట్ పై నుంచి వరదనీరు..చేతులెత్తేసిన అధికారులు..దేవుడే కాపాడాలన్న మంత్రి!

తెలంగాణ రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులకు వరద ఉధృతి గంట గంటకు పెరుగుతూ పోతుంది. ఇక కడెం ప్రాజెక్టు డేంజర్ జోన్ లో పడింది. భారీగా ప్రాజెక్టులోకి వరద నీరు చేరుతుండడంతో.. ఏ క్షణంలో ఏదైనా జరగొచ్చు.. అని ప్రాజెక్ట్ వదిలి అధికారులు వెళ్ళిపోయారు. మరో పక్క ప్రాజెక్ట్ పై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. 4 గేట్లు మొరాయించగా.. కొన్ని గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిస్థితిని పరిశీలించి.. కడెం ప్రాజెక్ట్ ను ఆ ఎల్లమ్మ తల్లే కాపాడాలన్నారు.

New Update
కడెం ప్రాజెక్ట్ పై నుంచి వరదనీరు..చేతులెత్తేసిన అధికారులు..దేవుడే కాపాడాలన్న మంత్రి!

తెలంగాణ రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులకు వరద ఉధృతి గంట గంటకు పెరుగుతూ పోతుంది. దీంతో ఇప్పటికే అన్నీ ప్రాజెక్టులు నిండుకుండలా మారి ప్రమాద హెచ్చరికలను దాటేశాయి. ఈ నేపథ్యంలో కడెం ప్రాజెక్టు డేంజర్ జోన్ లో పడింది. భారీగా ప్రాజెక్టులోకి వరద నీరు చేరుతుండడంతో.. ఏ క్షణంలో ఏదైనా జరగొచ్చు.. అని ప్రాజెక్ట్ వదిలి అధికారులు వెళ్ళిపోయారు. ప్రాజెక్ట్ పై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది.

Flood water from the top of Kadem project..Officials raised their hands..God should save the minister!

ఎగువన కురుస్తోన్న వర్షాలతో కడెం ప్రాజెక్టుకు భారీగా వరద పెరుగుతోంది. అయితే గేట్లు తెరవడానికి అధికారులు చేసిన ప్రయత్నాలు ముందు ఫలించలేదు. దీంతో గేట్ల పై నుంచి వరద పారుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్తాయి నీటిమట్టం 700 అడుగులు. ప్రస్తుత నీటిమట్టం 697.800 అడుగులు. అయితే ప్రాజెక్ట్  ఎగువ నుంచి 3 లక్షల 87 వేల క్యూసెక్కులకు పైగా వరద వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్ట్ 14 గేట్లు ఎత్తి.. దిగువకు 2 లక్షల 47 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు అధికారులు.

అయితే మరో 4 గేట్లు మొరాయించాయి. సమాచారం అందుకున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రాజెక్ట్ దగ్గరికి చేరుకొని ఇరిగేషన్ అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. తెరుచుకోని గేట్ల మరమ్మత్తుల కోసం ఎక్స్ పర్ట్స్ ను రప్పిస్తున్నామన్నారు. ఈలోగా..ఎగువ నుంచి వరద ఉధృతి పెరుగుతుండడంతో ప్రాజెక్ట్ పరివాహక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇక కడెం ప్రాజెక్ట్ ను ఆ ఎల్లమ్మ తల్లే కాపాడాలన్నారు మంత్రి.

మరోవైపు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. వరద ఉధృతితో ప్రాజెక్ట్ దగ్గరకు పర్యాటకులను అనుమతించడం లేదు. అయితే వరద ప్రవాహం కొనసాగుతుండడంతో ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతంలోని గ్రామాల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. కడెం ప్రాజెక్ట్ ను కలెక్టర్ వరుణ్ రెడ్డి సందర్శించి వరద పరిస్థితులను సమీక్షించారు. 10 గ్రామాల ప్రజలను అలర్ట్ గా ఉండాలన్నారు.వరద ఎక్కువైతే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు