టీబీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్..ఈసారి బరిలోకి ఎంపీలు..!!

రాబోయే తెలంగాణ ఎన్నికలతో సౌత్ గేట్ ను ఓపెన్ చేయాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయిన బీజేపీ అధిష్టానం.. ఆ బాధ్యతలను అమిత్ షాకు అప్పగించింది. దీంతో కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉన్న టీబీజేపీలో హల్ చల్ మొదలైంది. మరోవైపు రానున్న ఎన్నికల్లో 75 స్థానాలను కైవసం చేయడానికి స్కెచ్ వేస్తున్న బీజేపీ అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయడానికి ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ వైరల్ అవుతోంది.

New Update
టీబీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్..ఈసారి బరిలోకి ఎంపీలు..!!

రాబోయే తెలంగాణ ఎన్నికలతో సౌత్ గేట్ ను ఓపెన్ చేయాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయిన బీజేపీ అధిష్టానం.. ఆ బాధ్యతలను అమిత్ షాకు అప్పగించింది. దీంతో కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉన్న టీబీజేపీలో హల్ చల్ మొదలైంది. చేరికలతో హడావుడి చేయాలని నేతలంతా ఫిక్స్ అయ్యారు. దీంతో వేరే పార్టీలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. చేరికలతోనే బీఆర్ఎస్, కాంగ్రెస్ లకు షాక్ ఇవ్వాలని ఈ రెండు పార్టీల్లోని అసంతృప్తులకు గాలం వేసే పనిలో రాష్ట్ర బీజేపీ నాయకులు పడ్డారు.

మరో వైపు ఎలాగైనా..రానున్న ఎన్నికల్లో 75 స్థానాలను కైవసం చేయడానికి స్కెచ్ వేస్తున్న బీజేపీ అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయడానికి ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. నియోజకవర్గాల వారీగా క్యాండిడేట్స్ ను జల్లెడ పడుతోంది. బీఆర్ఎస్ ఇంకా కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగుతున్న అభ్యర్థులను బట్టి.. ఆచితూచి సర్వే రిపోర్ట్ ల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో మునిగింది. అయితే ఈ క్రమంలో బీజేపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ అంటూ ఓ జాబితా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

దాని ప్రకారంగా చూసుకుంటే..రానున్న ఎన్నికల్లో ఎంపీలంతా అసెంబ్లీ స్థానాల నుంచి బరిలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది. కిషన్ రెడ్డి, బండి సంజయ్, అర్వింద్, సోయం బాపురావుతో పాటు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కూడా అసెంబ్లీ నుంచే బరిలోకి దిగుతున్నారట. అయితే వీరంతా కూడా ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో కీలకంగా ఉన్నారు. దీంతో ముందుగా వీరిని గెలుపుగుర్రాలుగా మలుచుకోవాలని హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం.

ఇక కేసీఆర్ ఇలాకా గజ్వేల్ నుంచి ఈటలను రంగంలోకి దింపడానికి అమిత్ షా ప్లాన్ వేస్తున్నట్టు తెలుస్తోంది. దీని ప్రకారంగానే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న టీబీజేపీ మొదటి జాబితాలో గజ్వేల్ నుంచి ఈటల పేరు ఉంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫస్ట్ లిస్ట్...

1.కిషన్ రెడ్డి- అంబర్ పేట్

2.బండిసంజయ్ –కరీంనగర్

3.డాక్టర్ లక్ష్మణ్ –ముషీరాబాద్

4.ధర్మపురి అర్వింగ్-ఆర్మూర్

5.సోయంబాపూరావు-బోథ్

6.ఈటల రాజేందర్-గజ్వేల్

7.డీకే అరుణ-గద్వాల

8.రఘునందన్ రావు-దుబ్బాక

9.కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి-మునుగోడు

10.జితేందర్ రెడ్డి-మహబూబ్ నగర్ లేదా నారాయణ్ పేట్

11.మురళీధర్ రావు-కూకట్ పల్లి లేదా వేములవాడ

12.ఇంద్రసేనా రెడ్డి-ఎల్బీ నగర్

  1. వివేక్ –చెన్నూరు
  2. విజయశాంతి-మెదక్

15.యెండల లక్ష్మినారాయణ-నిజామాబాద్ అర్బన్

16.ఎన్వీఎస్ ఎస్ రావు-మల్కాజ్ గిరి

17.ఆచారి-కల్వకుర్తి

18.జయసుధ- సికింద్రాబాద్

19.రాజా సింగ్-గోషామహల్

  1. జుక్కల్- గాజుల బుచ్చన్న

21.ఈటల జమున-హుజూరాబాద్

22.గరికపాటి మోహన రావు-వరంగల్

23.కొండా విశ్వేశ్వర్ రెడ్డి- తాండూర్

24.బూర నర్సయ్య గౌడ్-భువనగిరి లేదా ఇబ్రహీంపట్నం

25.కూన శ్రీశైలం గౌడ్-కుత్బుల్లాపూర్

  1. మహేశ్వర్ రెడ్డి-నిర్మల్
  2. రాథోడ్ రమేష్- ఆసిఫాబాద్

28.పొంగులేటి సుధాకర్ రెడ్డి-ఖమ్మం

29.బాబు మోహన్-ఆంధోల్

30.నందీశ్వర్ గౌడ్-పటాన్ చెరు

Advertisment
Advertisment
తాజా కథనాలు