Fashion: అవుట్‌ఫిట్ కలర్‌తో లిప్‌స్టిక్ షేడ్ మ్యాచ్ చేయడం కష్టంగా ఉందా..? ఇలా చేయండి..! ముఖం ఆకర్షణీయంగా కనిపించేలా చేయడంలో సరైన లిప్‌స్టిక్ షేడ్ ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. కానీ లిప్‌స్టిక్ షేడ్ అవుట్‌ఫిట్ కలర్ తో మ్యాచ్ చేయడమే చాలా కష్టమైన పని. దీని కోసం కొన్ని టిప్స్ ఉన్నాయి. ఎలాంటి రంగు దుస్తువులకు ఏ షేడ్స్ మ్యాచ్ అవుతాయో తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్ళండి. By Archana 26 Apr 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Fashion: లిప్ స్టిక్ ముఖాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది. ఇది మొత్తం రూపాన్ని మార్చే అటువంటి ప్రోడక్ట్. అయితే లిప్ స్టిక్ వేసుకునే ముందు దానిని బట్టలతో ఎలా మ్యాచ్ చేయాలో తెలుసుకోవాలి. తద్వారా లుక్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మీరు మీ రంగురంగుల దుస్తులతో సరైన రంగు లిప్‌స్టిక్‌ను ఎంచుకోవాలనుకుంటే. ఈ టిప్స్ ఫాలో అవ్వండి. డ్రెస్ కు మ్యాచ్ అయ్యేలా కలర్ కాంబినేషన్ ఎలా సెట్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము.. బ్లాక్ కలర్ మీరు బ్లాక్ కలర్ దుస్తులను ధరించబోతున్నట్లయితే, ఈ మూడు రంగులు దానితో చాలా అందంగా కనిపిస్తాయి. ప్రతి స్కిన్ టోన్‌కి డస్కీ లేదా లైట్ సూట్ అవుతుంది. వైన్ షేడ్, క్లాసిక్ రెడ్ షేడ్, న్యూడ్ పీచ్ షేడ్. మీ స్కిన్ టోన్ ప్రకారం ఈ లిప్ స్టిక్ షేడ్స్ అప్లై చేయండి. ఈ షేడ్స్ నలుపు రంగు దుస్తులలో రూపాన్ని మరింత అందంగా మారుస్తాయి. రెడ్ డ్రెస్ చాలా మంది అమ్మాయిలు రెడ్ కలర్ డ్రస్సులు ధరించడం మానేస్తారు. ఇది చాలా బోల్డ్ రంగుగా పరిగణించబడుతుంది. కానీ మీరు బోల్డ్ కలర్ దుస్తులను ధరించినట్లయితే. దాన్ని ఈ లిప్‌స్టిక్ షేడ్స్ తో మ్యాచ్ చేయండి అదిరిపోతుంది. చెర్రీ షేడ్, క్లాసిక్ రెడ్ షేడ్, మెరూన్ షేడ్ బ్లూ దుస్తుల నీలం రంగులో చాలా షేడ్స్ ఉంటాయి. కానీ మీరు రాయల్ బ్లూ లేదా డార్క్ బ్లూ దుస్తువులతో లిప్‌స్టిక్ షేడ్స్ మ్యాచ్ చేయాలనుకుంటే, ఈ మూడు రంగులను ప్రయత్నించవచ్చు. న్యూడ్ పీచ్ షేడ్, సాఫ్ట్ పింక్ షేడ్, కోరల్ షేడ్ గ్రీన్ డ్రెస్ గ్రీన్ డ్రెస్ వేసుకున్నప్పుడు లుక్ మరింత హైలెట్ అవ్వడానికి ఈ లిపిస్టిక్ షేడ్స్ ట్రై చేయండి. బ్రిక్ రెడ్, డీప్ బెర్రీ, న్యూడ్ పీచ్ ఎల్లో డ్రెస్ పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. అటువంటి పరిస్థితిలో, చాలా మంది మెహందీ లేదా షాగున్ రోజు కోసం ఎల్లో దుస్తులను ప్రిఫర్ చేస్తారు. ఈ ఔట్ ఫిట్ కోసం ఈ మూడు లిప్ స్టిక్ షేడ్స్ బాగుంటాయి. కోరల్, సాఫ్ట్ పింక్, క్లాసిక్ రెడ్ పర్పుల్ డ్రెస్ పర్పుల్ రంగు దుస్తువులను ఎంచుకున్నప్పుడు.. లిప్స్టిక్ షేడ్స్ ఎంచుకోవడం కష్టం అవుతుంది. అయితే ఈ మూడు షేడ్స్ మీ రూపాన్ని పర్ఫెక్ట్ గా మార్చడంలో సహాయపడతాయి. పింక్ న్యూడ్ షేడ్, న్యూడ్ బ్రౌన్ షేడ్, పింక్ విండ్ పర్పుల్ షేడ్ వైట్ డ్రెస్ తెలుపు రంగు దుస్తులలో ఆకర్షణీయమైన లుక్ కావాలంటే ఈ మూడు షేడ్స్ ను ప్రయత్నించవచ్చు. మాట్ మెరూన్ షేడ్, న్యూడ్ బ్రౌన్ షేడ్ విత్ లిప్ గ్లోస్, పీచ్ షేడ్స్ Also Read: Aam Panna Drink: సమ్మర్ స్పెషల్ డ్రింక్ ఆమ్ పన్నా .. హీట్ స్ట్రోక్ కు అద్భుతమైన చిట్కా #fashion-tips #fashion #lipstick మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి