Bengaluru Mall: ధోతీ ధరించాడని రైతును షాపింగ్‌ మాల్‌లోకి రానివ్వలేదు

బెంగళూరులోని ఓ మాల్‌లో రైతుకు అన్యాయం జరిగింది. ధోతీ ధరించాడని ఓ రైతును షాపింగ్‌ మాల్‌లోకి రానివ్వలేదు. ప్యాంట్‌ వేసుకొని వస్తేనే అనుమతిస్తామని సెక్యూరిటీ సిబ్బంది చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.

New Update
Bengaluru Mall: ధోతీ ధరించాడని రైతును షాపింగ్‌ మాల్‌లోకి రానివ్వలేదు

Bengaluru Mall: బెంగళూరులోని ఓ మాల్‌లో రైతుకు అవమానం జరిగింది. ధోతీ ధరించాడని ఓ రైతును షాపింగ్‌ మాల్‌లోకి రానివ్వలేదు. ప్యాంట్‌ వేసుకొని వస్తేనే అనుమతిస్తామని సెక్యూరిటీ సిబ్బంది చెప్పింది. ఈ ఘటన జూలై 16న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో బెంగళూరులోని మాగడి మెయిన్‌ రోడ్డులోని జీటీ మాల్‌లో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. దేశం అభివృద్ధి చెందుతుంది అంటే ఇదేనా? అని ప్రశ్నిస్తున్నారు. భారత దేశ సంస్కృతిని అవమానించేలా ప్రవర్తించిన ఆ మాల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

అసలేం జరిగింది..

ఫకీరప్ప అనే సప్తవర్ణ రైతు తన కొడుకుతో కలిసి మల్టీప్లెక్స్‌లో సినిమా చూసేందుకు బెంగళూరులోని ఒక మాల్‌కు వెళ్లాడు. ధోతి ధరించి వచ్చాడన్న కారణంతో అతడిని మాల్ లోపలికి సెక్యూరిటీ సిబ్బంది అనుమతించలేదు. కాగా ఎందుకు తన తండ్రిని అనుమతించడం లేదని రైతు కుమారుడు సెక్యూరిటీ సిబ్బందిని ప్రశ్నించగా.. లోపలికి ప్యాంటు, షర్ట్ వేసుకొని వస్తేనే అనుమతిస్తామని సెక్యూరిటీ సిబ్బంది స్పష్టం చేశారు. దీంతో ఆ సంభాషణను చిత్రీకరించిన ఆ రైతు కుమారుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఈ ఘటనకు నిరసనగా కన్నడ సంస్థల కార్యకర్తలు ఉదయం మాల్ ముందు నిరసనకు దిగారు. పలువురు పంచె ( ధోతి) ధరించి మాల్‌లోకి వెళ్లి తమ నిరసన తెలిపారు. రైతు ఫకీరప్పను కూడా మాల్‌కు తీసుకువచ్చారు. అక్కడ మాల్ యాజమాన్యం ప్రతినిధులు అతనికి బహిరంగంగా క్షమాపణలు చెప్పి సౌకర్యాలు కల్పించారు. అంతకుముందు జూలై 16న ఫకీరప్పను అనుమతించని సెక్యూరిటీ సూపర్‌వైజర్ క్షమాపణలు చెప్పారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు