Medigadda Barrage: నేడు మేడిగడ్డకు నిపుణుల కమిటీ TG: ఈరోజు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీను నిపుణుల కమిటీ సందర్శించనుంది. నిర్మాణపరంగా, నాణ్యత పరంగా, నిర్వహణ పరంగా లోపాలను వెలికితీయడంతో పాటు వాటికి బాధ్యులను గుర్తించేందుకు రేవంత్ సర్కార్ ఈ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. By V.J Reddy 01 Jun 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Medigadda Barrage: మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీను నిపుణుల కమిటీ సందర్శించనుంది. నిర్మాణపరంగా, నాణ్యత పరంగా, నిర్వహణ పరంగా లోపాలను వెలికితీయడంతో పాటు వాటికి బాధ్యులను గుర్తించేందుకు నియమించిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్‌కు సాంకేతిక అంశాల్లో సాయం కోసం వేసిన ఈ కమిటీ ఈరోజు ఆయా బ్యారేజీలను సందర్శించనుంది. సివిల్ స్ట్రక్చరల్ అంశాల కోసం ఎన్‌ఐటీ వరంగల్ పూర్వ ప్రొఫెసర్ సి.బి.కామేశ్వరరావు, మెకానికల్ రంగంపై డ్యామ్ సేఫ్టీ రిప్యూ ప్యానల్ నిపుణుడు మాజీ చీఫ్ ఇంజనీర్ కె.సత్యనారాయణ, జియో టెక్నికల్ అంశాలపై ఎన్‌ఐటీ వరంగల్ ప్రొఫెసర్ కె.రమణమూర్తి తదితరులతో కమిటీ వేయగా ఆ కమిటీ బ్యారేజీలను తనిఖీ చేయనుంది. జూన్ 7, 8 తేదీల్లో కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆయా బ్యారేజీలను పరిశీలించనున్నారనే నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న మరమ్మతులను కమిటీ పరిశీలించనుంది. ఇక మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ఏ విధంగా ఉన్నాయో కేంద్ర సంస్థలతో భూభౌతిక, భూసాంకేతిక పరీక్షలు చేయించాలని ఎన్‌డీఎస్‌ఏ నివేదిక ఇచ్చిన విషయం విదితమే. పుణేలోని కేంద్ర నీటి, విద్యుత్ పరిశోధన సంస్థ(సీడబ్ల్యూపీఆర్‌ఎస్), ఢిల్లీకి చెందిన కేంద్ర మృత్తిక, ఇతర భూపదార్థాల పరిశోధన కేంద్రం(సీఎస్‌ఎంఆర్‌ఎస్)తో, హైదరాబాద్‌లోని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ(ఎన్‌జీఆర్‌ఏ)తో అధ్యయనం చేయించాలని ఎన్‌డీఎస్‌ఏ సిఫారసు చేయగా.. సీడబ్ల్యూపీఆర్‌ఎస్ మాత్రమే స్పందించింది. ఒక్కో బ్యారేజీ పరీక్షకు రూ.కోటి ఖర్చవుతుందని అంచనాలు సమర్పించింది. #medigadda-project మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి