నలభై దాటితే ఈ వ్యాయామాలు తప్పనిసరి! నలభై ఏళ్లు దాటాక ఫిట్‌గా ఉండాలంటే కష్టమైన వ్యాయామాలు చేస్తే శరీరానికి మంచిది కాదు. క్రంచెస్, కార్డియో వర్కవుట్స్, మోకాళ్ల కండరాలపై ఒత్తిడి చేసే వ్యాయామాలు, పుషప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నలభై ప్లస్‌లో ఉండే వాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయాల్సిన వ్యాయమాలు తెలుసుకుందాం. By Durga Rao 27 Jun 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి జీవనశైలి, ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, ఒత్తిడి.. ఇలా పలు కారణాల వల్ల నలభై ప్లస్‌లోనే అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. శరీరం చురుగ్గా ఉంచుకోవాలంటే శారీరక శ్రమ అవసరం. ముఖ్యంగా ప్రతి రోజూ నడక తప్పనిసరి. దీనివల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. బరువు తగ్గుతారు. మంచి నిద్ర పడుతుంది. జాగింగ్ చేసినా మంచి ఫలితం ఉంటుంది. దీనివల్ల హానికరమైన కొవ్వు తగ్గుతుంది. ఎలాంటి పరికరాలూ అవసరం లేదు. కేవలం మంచి షూ ఉంటే సరిపోతుంది. తాజా కూరగాయలు, పండ్లు తీసుకోవటం వల్ల మెటబాలిజమ్ పెరుగుతుంది. నొప్పులు, వాపులతో బాధపడుతుంటే క్యాల్షియం ఉండే ఆహారపదార్థాల్ని తినాలి. తేలికపాటి స్ర్టెచ్చింగ్ చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. సైక్లింగ్ చేయటం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. హార్వర్డ్ యూనివర్శిటీ వారు చేసిన ఓ అధ్యయనం ప్రకారం సైక్లింగ్ చేసే వారి శరీరం ఫిట్‌గా ఉంటుంది. అనారోగ్య సమస్యలు తక్కువని తేలింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా తేలికగా చేసే వర్కవుట్ ఏంటంటే.. ఈత కొట్టడం. ఈతవల్ల బరువు తగ్గుతారు. శరీరం ఫిట్‌గా ఉంటుంది. అలవాటు చేసుకుంటే ఇదో ఉత్తమ వ్యాయామం.వాస్తవానికి గృహిణులు ఇంట్లో చేసే పనులూ మంచి వ్యాయామాన్ని ఇస్తాయి. అయితే ఒత్తిడి, సరైన పోషకారం తీసుకోలేకపోతే అనేక సమస్యలు దరి చేరతాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులు ఉండే వాళ్లు వర్కవుట్స్ కంటే యోగాను ఆశ్రయించడం మంచిది. యోగా గురుల సమక్షంలో తేలికపాటి యోగాసనాలు చేస్తే.. శరీరం ఉత్తేజంగా ఉంటుంది. యోగా అలవాటయితే.. మంచి నిద్రపడుతుంది. శరీరం స్ర్టెచ్ అవుతుంది. రక్తప్రసరణ మెరుగవుతుంది. ముఖ్యంగా ఒత్తిడి తగ్గి.. ఫిట్‌గా ఉండేందుకు తోడ్పడుతుంది. #healthtips మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి