AP: పార్టీ నాకు ద్రోహం చేసింది.. కన్నీరు పెట్టుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే.! వైసీపీ నుంచి సస్పెండ్ అయిన కదిరి మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. పార్టీకి ఎప్పుడు తాను ద్రోహం చేయలేదని..పార్టీనే తనకు ద్రోహం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పార్టీలో చేరాలన్నది ఆప్తులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని సిద్ధారెడ్డి వెల్లడించారు. By Jyoshna Sappogula 11 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ అనంతపురం New Update షేర్ చేయండి EX MLA Sidda Reddy: వైసీపీ నుంచి సస్పెండ్ అయిన కదిరి మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. పార్టీకి ఎప్పుడు తాను ద్రోహం చేయలేదని ..పార్టీనే తనకు ద్రోహం చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్లుగా ఇటుక ఇటుక పేర్చి పార్టీని బలోపేతం చేస్తే పార్టీ తనకు సస్పెండ్ అనే బహుమతిని ఇవ్వడం దురదృష్టకరమన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉండగానే ఇన్చార్జిని తీసుకొని వచ్చి అధిష్ఠానం తనను అవమానపరిచిందన్నారు. Also Read: జగన్ను సాగనంపారు.. ఇక రాబోయే రోజుల్లో జరిగేది ఇదే: ఎమ్మెల్యే అధికారులకు తాను ఫోన్ చేస్తే పలకవద్దని అధికారులను కొందరు పార్టీ పెద్దలు కట్టడి చేశారని పార్టీ అధిష్టానం మీద ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ తనకు నేరుగా చెప్పి ఉండి ఉంటే తాను తప్పులను సరిచేసుకునే వాడినన్నారు. కొంతమంది డబ్బు కోసం పదవుల కోసం పార్టీని నాశనం చేశారని ఆరోపించారు. రేపటి నుంచి తన రాజకీయం మళ్లీ మొదలవుతుందని.. తానేంటో చూపిస్తానన్నారు. ఏ పార్టీలో చేరాలన్నది ఆప్తులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని సిద్ధారెడ్డి వెల్లడించారు. #ex-mla-sidda-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి