MLA Jagan : ఎమ్మెల్యేగా జగన్ ప్రమాణస్వీకారం

AP: ఎమ్మెల్యేగా మాజీ సీఎం జగన్ ప్రమాణస్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి జగన్ తో ప్రమాణస్వీకారం చేయించారు. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 11 స్థానాలకు పరిమితమైన వైసీపీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోల్పోయింది.

New Update
MLA Jagan : ఎమ్మెల్యేగా జగన్ ప్రమాణస్వీకారం

Ex. MLA Jagan : ఎమ్మెల్యేగా మాజీ సీఎం జగన్ (Jagan) ప్రమాణస్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి (Butchaiah Chowdary) జగన్ తో ప్రమాణస్వీకారం చేయించారు. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నిక (Assembly Elections) ల్లో 11 స్థానాలకు పరిమితమైన వైసీపీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోల్పోయింది. ఇదిలా ఉంటే వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న పులివెందులలో మాజీ సీఎం జగన్ మరోసారి పోటీ చేయగా.. 2019 వచ్చిన మెజారిటీ కంటే తక్కువ మెజారితో గెలుపొందారు.

Also Read: ఎమ్మెల్యేలుగా చంద్రబాబు, పవన్‌ కల్యాణ్ ప్రమాణస్వీకారం

2019 అసెంబ్లీ ఎన్నికల్లో 90,110 ఓట్ల మెజారితో గెలిచిన జగన్.. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 61,687 ఓట్ల మెజారితో గెలిచారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ ఈసారి ఎన్నికల్లో కూడా తామే అధికారంలోకి వస్తామని.. తాము అందించిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ధీమా ఉన్న జగన్ కు రాష్ట్ర ప్రజలు కలలో కూడా ఊహించని షాక్ ఇచ్చారు. కేవలం 11 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులకు గెలిపించారు. దీంతో జగన్ సీఎం కుర్చీ పోయి.. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కూడా లేకుండా పోయింది. ఎన్నికల ఫలితాలపై జగన్ రివ్యూ చేస్తున్నారు. ఓటమి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. వైసీపీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. త్వరలో జగన్ ఓదార్పు యాత్ర కూడా చేపడుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు