ధనిక రాష్ట్రం అయితే డబుల్ బెడ్ రూం ఇండ్లు ఎందుకు నిర్మిస్తలేరు....!

New Update
ధనిక రాష్ట్రం అయితే డబుల్ బెడ్ రూం ఇండ్లు ఎందుకు నిర్మిస్తలేరు....!

తెలంగాణ ధనిక రాష్ర్టం అయితే బీఆర్ఎస్ సర్కార్ ఇండ్లు ఎందుకు నిర్మిస్తలేదని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రశ్నించారు. కూలి చేసుకుని సంపాదించిన పైసలు బార్ షాపులకు వెళ్తున్నాయని ఆయన మండిపడ్డారు. తెలంగాణ రాకముందు ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ ఎందుకు నెరవేరుస్తలేరని ఈటల ప్రశ్నించారు.

etela rajender fires on cm kcr 18

ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2023 తర్వాత కేసీఆర్ సర్కార్ పని ఖతమేనన్నారు. మళ్ళీ కేసీఆర్ కు ఓటు వేయబోమని పేద ప్రజలు చర్చించు కుంటున్నారని చెప్పారు. 2014లో అధికారంలోకి వచ్చాక కేంద్రం ఆశ్చర్య పోయే రీతిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కట్టిస్తామని కేసీఆర్ గొప్పలు చెప్పారని తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు సాధ్యం కాదని తాము అప్పుడే చెప్పామన్నారు.

ప్రజలకు డబ్బులిస్తే వాళ్లే ఇండ్లు కట్టుకుంటారని అప్పుడే తెలిపామన్నారు. కానీ ఆ సమయంలో కేసీఆర్ తమ మాటలు పట్టించుకోలేదన్నారు. బాట సింగారంలో నిర్మించిన ఇండ్ల గోడలు పెచ్చులూడి పోయాయన్నారు. కానీ అర్హులకు మాత్రం అందలేదన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల సందర్శనకు వెళ్తుండగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని, తనను పోలీసులతో అరెస్టు చేయించారని పేర్కొన్నారు.

రెండోసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కు కళ్ళు నెత్తికెక్కాయన్నారు. ఈ రోజు ధర్నా రాజకీయ కార్యక్రమం కాదన్నారు. పేద ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సభ అని స్పష్టం చేశారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి హడ్కో ద్వారా రూ. 2 లక్షలు కేంద్ర నిధులను కేసీఆర్ తీసుకున్నారన్నారు. ఆ డబ్బులు నీ అబ్బ జాగీరా …డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి చూపియ్యి అని ఫైర్ అయ్యారు. బీజేపీ ప్రభుత్వం వస్తే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇంట్లో ఉన్న ఇద్దరు వృద్దులకు పెన్షన్ ఇస్తామన్నారు. అర్హులైన పేద రైతులకే రైతు బంధు, రైతు బీమా ఇస్తామన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు