కానిస్టేబుల్ కిరాతకం..తండ్రిని ఇంటికి పిలిపించుకుని ఏం చేశాడంటే..? ఆస్తికోసం కన్న కొడుకే చిత్రహింసలు పెడుతున్నాడని భీమవరానికి చెందిన రిటైర్డ్ ఏఎస్ఐ కొండలరావు ఆర్టీవీతో ఆవేదన వ్యక్తం చేశారు. కని పెంచిన కొడుకు నుంచే తనకు రక్షణ కావాలని రిటైర్డ్ ఏఎస్ఐ కొండలరావు కేసు పెట్టారు. ద్వారకా తిరుమలలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న తన పెద్ద కొడుకు మధు.. తనను ఇంటికి పిలిచి మరీ ఇనుపరాడ్ తో దాడి చేశాడని కన్నీటి పర్యంతం చెందుతున్నాడు. దీంతో కానిస్టేబుల్ మధు తీరుపై సర్వత్ర విమర్శలు గుప్పిస్తున్నారు. బాధ్యతమైన పదవిలో ఉంటూ రిటైర్ట్ అయిన కన్న తండ్రిని ప్రేమగా చూసుకోవాల్సింది పోయి ఆస్తి కోసం ఇంత దారుణంగా ప్రవర్తిసారా అంటూ మండిపడుతున్నారు. By Jyoshna Sappogula 12 Oct 2023 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Eluru Retired ASI: ఆస్తికోసం కన్న కొడుకే చిత్రహింసలు పెడుతున్నాడని భీమవరానికి చెందిన రిటైర్డ్ ఏఎస్ఐ కొండలరావు ఆర్టీవీతో ఆవేదన వ్యక్తం చేశారు. కని పెంచిన కొడుకు నుంచే రక్షణ కావాలని రిటైర్డ్ ఏఎస్ఐ కొండలరావు వేడుకుంటున్నాడు. ద్వారకా తిరుమలలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న తన పెద్ద కొడుకు మధు.. తనను ఇంటికి పిలిచి మరీ ఇనుపరాడ్ తో దాడి చేశాడని కన్నీటి పర్యంతం చెందుతున్నాడు. దీంతో కానిస్టేబుల్ మధు తీరుపై సర్వత్ర విమర్శలు గుప్పిస్తున్నారు. బాధ్యతమైన పదవిలో ఉంటూ రిటైర్ట్ అయిన కన్న తండ్రిని ప్రేమగా చూసుకోవాల్సింది పోయి ఆస్తి కోసం ఇంత దారుణంగా ప్రవర్తిసారా అంటూ మండిపడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన రిటైర్డ్ ఏఎస్ఐ కొండలరావు ఆర్టీవీతో తన ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఏఎస్ఐ కొండలరావుకు ముగ్గురు కొడుకులు. అందులో పెద్ద కొడుకు ద్వారకా తిరుమలలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. మీగితా ఇద్దరి కొడుకులు ఎవరికి వారు మంచిగా సెటిల్ అయ్యారు. రిటైర్డ్ ఏఎస్ఐ కొండలరావు తన తండ్రీ నుంచి వచ్చిన ఆస్తిని ముగ్గిరి కొడుకులకు సమానంగా పంచారని తెలిపారు. అయితే, పెద్ద కొడుకు మధు ఎప్పడు ఆస్తి కోసం వివాదం చేసేవాడని కొండలరావు అన్నారు. కొండలరావు పెద్ద కొడుకు కానిస్టేబుల్ మధు ..తల్లిదండ్రులకు వైద్యం చికిత్స చేయిస్తాను అని ఇంటికి పిలిపించుకున్నాడు. వెంటనే కొడుకు మాటలు నమ్మని తండ్రి కొండలరావు తన భార్యతో కలిసి కొడుకు ఇంటికి వెళ్లాడు. అయితే పెద్ద కొడుకు మధు ఆస్తి కోసం చిత్ర హింసలు పెడుతున్నాడని రిటైర్డ్ ఏఎస్ఐ కొండలరావు వాపోతున్నాడు. ఆస్తి ఇవ్వకపోతే తనను చంపుతానంటూ బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు..ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా తనను బంధించి రాడ్లతో కొట్టాడని కొండలరావు భావోద్వేగం చెందాడు. లేని ఆస్తి ఎక్కడి నుంచి తీసుకురావాలంటు కన్నీటి పర్యంతం చెందుతున్నాడు. కొడుకు చిత్ర హింసలు భరించలేని రిటైర్డ్ ఏఎస్ఐ కొండలరావు పోలీసులను ఆశ్రయించారు. తన పెద్ద కొడుకు నుంచి తనకు ప్రాణ హాని ఉందంటు భీమవరంలో ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్ మధు తీరుపై సర్వత్ర విమర్శలు గుప్పిస్తున్నారు. బాధ్యతమైన పదవిలో ఉంటూ ఇలాగేనా ప్రవర్తించేది అని మండిపడుతున్నారు. రిటైర్ట్ అయిన కన్న తండ్రిని ప్రేమగా చూసుకోవాల్సింది పోయి ఆస్తి కోసం ఇంత దారుణంగా ప్రవర్తిసారా అంటూ కానిస్టేబుల్ మధు పై ఫైర్ అవుతున్నారు. Also Read: తిరుపతిలో రెచ్చిపోయిన స్మగ్లర్లు.. భారీగా ఎర్రచందనం స్వాధీనం #ap-constable #eluru-retired-asi-kondalrao #constable-madhu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి