Eluru District: ఎంతకష్టమొచ్చిందో.. భర్తను పొట్టుగా కొట్టి పారిపోయిన భార్య..

ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెం మండల పరిధిలోని లక్కవరంలో దారుణం చోటు చేసుకుంది. భార్య గుణపంతో భర్త తలను పగలగొట్టింది. భర్త ఏడుకొండలు తలపై భార్య బలంగా కొట్టడంతో ఏడుకొండలు అక్కడే కుప్పకూలాడు. దీనిని గమనించిన స్థానికులు 108 ఆంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు.

New Update
Eluru District: ఎంతకష్టమొచ్చిందో.. భర్తను పొట్టుగా కొట్టి పారిపోయిన భార్య..

ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెం మండల పరిధిలోని లక్కవరంలో దారుణం చోటు చేసుకుంది. భార్య గుణపంతో భర్త తలను పగలగొట్టింది. భర్త ఏడుకొండలు తలపై భార్య బలంగా కొట్టడంతో ఏడుకొండలు అక్కడే కుప్పకూలాడు. దీనిని గమనించిన స్థానికులు 108 ఆంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. ప్రమాద స్థిలికి చేరుకున్న వైద్య సిబ్బంది.. తీవ్ర గాయాలపాలైన ఏడుకొండలును స్థానిక ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు దాడికి సంబంధించిన సమాచారంపై ఆరా తీస్తున్నారు.

మరోవైపు ఏడుకొండలు తలపై గుణపంతో బలంగా మోదిన భార్య అనంతరం అక్కడి నుంచి పరారైనట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రతీరోజు ఏడుకొండలు మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడేవాడని స్థానికులు చెబుతున్నారు. ఎప్పటిలాగే ఇవాళ కూడా మద్యం తాగివచ్చి భార్యతో గొడవకు దిగాడని, భార్య అవేమీ పట్టించుకోకుండా ఇంట్లో తన పని తాను చేసుకుంటుందన్నారు.

దీంతో తాను ఇంతలా మాట్లాడుతున్నా పట్టించుకోవా అని ఏడుకొండలు భార్యను కొట్టినట్లు వారు తెలిపారు. దీంతో భార్య ఓపిక నశించడంతో పక్కనే ఉన్న గుణపంతో ఏడుకొండలు తలపై కొట్టిందని, అనంతరం తాను కూడా చస్తాను అనుకుంటూ ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిళ ఎక్కడికి వెళ్లింది అనేదానిపై సీసీ కెమెరాల ద్వారా దర్యాప్తు చేస్తున్నారు.

ALSO READ: మానవత్వం చాటుకున్న ఎంపీ

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ap Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. నేడు ఈ జిల్లాలలో వానలే ..వానలు!

ఆంధ్రప్రదేశ్‌లో గురువారం పలు జిల్లాలలో వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గురు, శుక్రవారం పలు జిల్లాలలో వర్షాలు కురవనున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది

New Update
Rains

Rains

ఏపీలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనపడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా గురువారం పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. అలాగే కొన్నిచోట్ల వడగాలులు వీచే అవకాశాలుకూడా ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 24 గంటల్లో బలపడనున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీనికి అనుబంధంగా వాయువ్య మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉన్నట్లు తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో గురువారం పలుచోట్ల వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

Also Read: Sai Sudarshan: చెండాడేశాడు భయ్యా.. చుక్కలు చూపించిన సుదర్శన్- ఎంత స్కోర్ చేశాడంటే?

గురువారం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, ప్రకాశం, నంద్యాల, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. పిడుగులు పడే అవకాశం ఉందని.. జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Also Read: Allu Arjun - Pavan Kalyan Son: సింగపూర్‌కు అల్లు అర్జున్.. పవన్ కొడుకు కోసం పయణం!

అల్పపీడనం ప్రభావంతో శుక్రవారం కూడా ఏపీలో వర్షాలు పడనున్నాయని అధికారులు ప్రకటించారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు, ప్రకాశం, నెల్లూరు, శ్రీసత్య సాయి జిల్లా, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ ప్రకటించారు.

ఇదే సమయంలో కొన్ని జిల్లాలలో ఎండలు పెరుగుతున్నాయి. బుధవారం కర్నూలు జిల్లా ఉలిందకొండలో 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎర్రంపేట, నంద్యాల జిల్లా దొర్నిపాడు, పల్నాడు జిల్లా అమరావతిలో 39.7,ప్రకాశం జిల్లా దరిమడుగలో40.3 , చిత్తూరు జిల్లా తవణంపల్లెలో40.1  , వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో39.9 డిగ్రీల  ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురువారం పలు మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. గురువారం 17 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని.. శుక్రవారం7 మండలాల్లో తీవ్రవడగాలులు, 66 మండలాల్లో వడగాలులు వీచేందుకు అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Also Read: Ram Charan Peddi AI Video: ఏం క్రియేటివిటీ రా బాబు..! వైరల్ అవుతున్న రామ్ చరణ్ AI వీడియో

Also Read: GT Vs RR: గుజరాత్ తొలి ఇన్నింగ్స్ పూర్తి.. రాజస్తాన్ టార్గెంట్ ఎంతంటే?

ap | rains | weather | andhra pradesh weather | andhra-pradesh-weather-forecast | andhra-pradesh-weather-report | ap today weather update | ap-weather | AP Weather Alert | latest-news | telugu-news | ap telugu news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment