Vanga Geetha: వంగా గీతకు షాక్.. ప్రచారాన్ని అడ్డుకున్న ఎన్నికల అధికారులు..! పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి వంగా గీతకు షాక్ తగిలింది. ఆమె ప్రచారాన్ని ఎన్నికల అధికారులు అడ్డుకున్నారు. అనుమతులు లేకుండా ఎలా ప్రచారం చేస్తారని ప్రశ్నించారు. అనుమతి పత్రాలు ఉంటే చూపించాలని అధికారులు కోరారు. దీంతో వంగా గీత అక్కడి నుంచి వెళ్లిపోయారు. By Jyoshna Sappogula 23 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి New Update షేర్ చేయండి Vanga Geetha: కాకినాడ జిల్లా పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత ప్రచారాన్ని ఫ్లైయింగ్ స్క్వాడ్ అడ్డుకున్నారు. పిఠాపురం నుంచి జనసేన తరుపున పవన్ కళ్యాణ్ బరిలో ఉండటంతో వంగా గీత ముందుగానే అలర్ట్ అయ్యారు. నియోజకవర్గ వ్యాప్తంగా గత వారం రోజులుగా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. యథావిధిగా ఆమె పిఠాపురం పట్టణంలోని 2,3,4 మున్సిపల్ వార్డుల్లో పెద్ద ఎత్తున కార్యకర్తలతో ఇంటింటా ప్రచారం చేస్తుండగా అధికారులు అడ్డుకున్నారు. Also Read: విజయవాడలో చంద్రబాబుకు నిరసన సెగ.. ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారి ఆర్.వి. ప్రసాద్ పోలీసు సిబ్బందితో వెళ్లి గీత ప్రచారానికి బ్రేకులు వేశారు. అనుమతులు లేకుండా ఏలా ఎన్నికల ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు. అనుమతి పత్రాలు ఉంటే చూపించాలన్నారు. అధికారులు, పోలీసులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఆమె అనుచరులు ప్రచారం ఆపివేసి అక్కడ నుండి నెమ్మదిగా వెళ్లిపోయారు. ఎన్నికల అధికారి అనుమతి లేకుండా కనీసం పార్టీ జెండా కూడా కట్టేందుకు అవకాశం లేదని ఆర్.వి. ప్రసాద్ తేల్చిచెప్పారు. #pithapuram #vanga-geetha మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి