Rajya Sabha Elections: తెలంగాణలో రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం

తెలంగాణలో రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. కాంగ్రెస్ నుంచి రేణుక చౌదరి, అనిల్ కుమార్ యాదవ్.. బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభకు వెళ్లనున్నారు.

New Update
Rajya Sabha Elections: తెలంగాణలో రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం

Telangana Rajya Sabha Elections: తెలంగాణలో రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. కాంగ్రెస్ నుంచి రేణుక చౌదరి, అనిల్ కుమార్ యాదవ్.. బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభకు వెళ్లనున్నారు.

ALSO READ: జగన్‌ను తిట్టమన్నారు… ఎమ్మెల్యే ఆర్కే సంచలన వ్యాఖ్యలు!

రేణుక చౌదరికి గుర్తింపు…

కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ కేంద్ర మంత్రి రేణుక చౌదరికి కాంగ్రెస్ హైకమాండ్ రాజ్యసభ టికెట్ కేటాయించింది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించి బెంగపడ్డారు రేణుక. ఆ తరువాత ఎమ్మెల్సీలో నైనా తనకు అవకాశం కాంగ్రెస్ అధిష్టానం ఇస్తుందని భావించిన ఆమెకు నిరాశే ఎదురైంది. అయితే.. ఇటీవల రేణుక చౌదరి ఖమ్మం నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్లు తెలిపింది. ఖమ్మం ఎంపీ టికెట్ ఆమె కాంగ్రెస్ అధిష్టానానికి దరఖాస్తు చేసుకుంది. తాజాగా ఆమె పార్టీకి చేసిన సేవలను గుర్తుంచిన కాంగ్రెస్ హైకమాండ్ రేణుక చౌదరికి రాజ్య సభ టికెట్ ఇచ్చింది.

నామ vs వద్దిరాజు..

ఇటీవల బీఆర్ఎస్ పార్టీ  నుంచి రాజ్య సభ రేసులో వద్దిరాజు రవిచంద్ర (Vaddiraju Ravichandra), ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు (Nama Nageswara Rao) ఉన్నారు. మొదటగా వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ అభ్యర్థిగా ఖాయం అనుకున్న బీఆర్ఎస్ అధిష్టానం.. ఎంపీ నామా ఎంట్రీతో ఎవరికి టికెట్ కేటాయించాలనే దానిపై గందరగోళంలో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే.. మరోవైపు ఖమ్మం నుంచి ఎంపీగా మరోసారి నామా నాగేశ్వరరావు పోటీ చేస్తారనే చర్చ కూడా ఉంది. తాజాగా కేసీఆర్ జరుగుతున్న ప్రచారాలకు చెక్ పెట్టారు. బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర పేరును ఖరారు చేశారు.

DO WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు