Bathukamma sarees: బతుకమ్మ చీరల పంపిణీకి ఎన్నికల ఎఫెక్ట్.. నెల ముందే పంచేట్టుగా కేసీఆర్ సర్కార్ కసరత్తు!

బతుకమ్మ చీరల పంపిణీని ఓ నెల ముందే చేపట్టాలని కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సెప్టెంబర్ నెల మధ్యలో నుంచి చీరల పంపిణీని ప్రారంభించినా.. అక్టోబర్ ఫస్ట్ వీక్ లో పూర్తి అవుతుంది. దీని కోసం వర్క్ వేగవంతంగా జరుగుతోంది. బతుకమ్మ చీరల కోసం ప్రభుత్వం 340 కోట్లు ఖర్చు చేస్తోంది. 240 డిజైన్లు ఈ సారి బతుకమ్మ చీరలకు సిద్ధమయ్యాయి...

New Update
Bathukamma sarees: బతుకమ్మ చీరల పంపిణీకి ఎన్నికల ఎఫెక్ట్.. నెల ముందే పంచేట్టుగా కేసీఆర్ సర్కార్ కసరత్తు!

Bathukamma sarees: ఎన్నికల నగారా మోగడానికి సమయం దగ్గర పడుతోంది. దీంతో అధికార ప్రతిపక్షాలు ప్రత్యేకమైన వ్యూహాలతో ప్రజలను తమ వైపు తిప్పుకునే పనిలో పడ్డారు. ఇక ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ ప్రభుత్వ పథకాలపై పడకుండా కేసీఆర్ సర్కార్ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా..బతుకమ్మ చీరల పంపిణీని ఓ నెల ముందే చేపట్టాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

బతుకమ్మ పండుగతో సంబంధం లేకుండా...!

ఎన్నికల కోడ్ సరిగ్గా బతుకమ్మ పండుగ సమయంలో వచ్చే ఛాన్స్ ఉండడంతో .. ప్రభుత్వం పండుగకు సంబంధం లేకుండా నే ముందుగానే చీరలను పంపిణీ చేయాలని భావిస్తోంది. కాగా, బతుకమ్మ సంబరాలు అక్టోబర్ 15 నుంచి మొదలుకానున్నాయి. అప్పటి వరకు చీరల పంపిణీని ఆపకుండా నెల రోజుల ముందు నుంచే స్టార్ట్ చేసి కోడ్ రావడం కంటే ముందే ఫినిష్ చేయాలని ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది.

Election effect of distribution of Bathukamma sarees.

తయారీకి ముమ్మర కసరత్తు..!

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఓ నెల రోజుల ముందే భారీగా బతుకమ్మ చీరలను తయారు చేయాల్సి ఉంది. సెప్టెంబర్ సెకండ్ వీక్ కల్లా చీరలు రెడీ కావాలి. అప్పుడే జిల్లా, మండల కేంద్రాల నుంచి గ్రామాలకు తరలించడం సాధ్యపడుతుంది. ఇక సెప్టెంబర్ నెల మధ్యలో నుంచి చీరల పంపిణీని ప్రారంభించినా.. అక్టోబర్ ఫస్ట్ వీక్ లో పూర్తి అవుతుంది. దీని కోసం వర్క్ వేగవంతంగా జరుగుతోంది. ఇప్పటికే ప్రభుత్వం నుంచి అర్డర్లను అందుకున్న వారు మరమగ్గాల్లో పని మొదలు పెట్టారు. దీని కోసం పవర్ లూమ్స్ రెండు, మూడు షిప్టుల్లో కూడా పని చేస్తున్నాయి. దాదాపు గా 25 వేల మరమగ్గాలపై 15 వేల మంది పనిచేస్తున్నట్లు సిరిసిల్ల నేతన్నలు వివరించారు. అయితే ఈ సారి కోటికి పైగా బతుకమ్మ చీరలను పంపిణీ చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది.

Election effect of distribution of Bathukamma sarees.

బతుకమ్మ చీరల కోసం 340 కోట్లు..!

బతుకమ్మ చీరల కోసం ప్రభుత్వం 340 కోట్లు ఖర్చు చేస్తోంది. అయితే లాస్ట్ ఇయర్ చీరల నాణ్యత, డిజైన్ విషయంలో మహిళల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. అయితే ఈసారి ఎన్నికల సమయం కావడంతో ఆ విషయంలో ప్రభుత్వం అన్నీ జాగ్రత్తలు తీసుకునే పనిలో పడింది. ఇప్పటికే చీరల తయారీకి అవసరమైన ముడిసరుకులన్నీ సిద్ధంగా ఉండడంతో అధికారులకు కాస్త ఉపశమనం దొరికింది. మొత్తం 240 డిజైన్లు ఈ సారి బతుకమ్మ చీరలకు సిద్ధమయ్యాయి. అయితే ఒక వేళ ఎక్కడైనా వ్యతిరేకత వస్తే.. ఆ ప్రాంతాల్లో వెంటనే సర్దుబాటు చర్యలు కూడా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం సాధ్యమైనంత త్వరగానే బతుకమ్మ చీరలను పంపిణీ చేయాలని ప్రభుత్వం ముమ్మర కరసత్తు చేస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు