AP DGP Transferred: సీఎం జగన్‌కు ఈసీ బిగ్ షాక్.. డీజీపీపై బదిలీ వేటు

AP: ఎన్నికల వేళ జగన్ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం బిగ్ షాక్ ఇచ్చింది. ఏపీ డీజీపీ పై బదిలీ వేటు వేసింది. విధుల నుంచి వెంటనే రిలీవ్ కావాలని ఆదేశాలు ఇచ్చింది. ముగ్గురు డీజీ ర్యాంక్ అధికారుల పేర్లతో ప్యానెల్‌ను పంపాలని సీఎస్‌కు ఆదేశాలు ఇచ్చింది.

New Update
AP DGP Transferred: సీఎం జగన్‌కు ఈసీ బిగ్ షాక్.. డీజీపీపై బదిలీ వేటు

AP DGP Transferred: ఎన్నికల వేళ జగన్ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం బిగ్ షాక్ ఇచ్చింది. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు వేసింది. విధుల నుంచి వెంటనే రిలీవ్ కావాలని తెలిపింది. ముగ్గురు డీజీ ర్యాంక్ అధికారుల పేర్లతో ప్యానెల్ ను పంపాలని సీఎస్ కు ఆదేశాలు ఇచ్చింది. రేపు  ఉదయం 11 గంటల్లోగా కొత్త డీజీపీ నియామక ప్రతిపాదనలు పంపాలని సీఎస్ ను కోరింది. కాగా వైసీపీకి అనుకూలంగా రాష్ట్ర డీజీపీ పనిచేస్తున్నారని విపక్షాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఫిర్యాదులు పరిశీలించిన ఎన్నికల సంఘం డీజీపీ పై బదిలీ వేటు వేసింది.

publive-image

ఇంటెలిజెన్స్ చీఫ్‌, విజయవాడ సీపీపై వేటు!

 ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌ PSR ఆంజనేయులుపై బదిలీ వేటు వేసింది. ఆంజనేయులును వెంటనే బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇంకా.. విజయవాడ నగర సీపీ కాంతిరాణాపై కూడా బదిలీ వేటు పడింది. వీరు తక్షణమే విధుల్లో నుంచి తప్పుకోవాలని ఈసీ ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికలతో సంబంధం లేని విధులకు అప్పగించాలని ఆదేశాలు ఇచ్చింది. కాగా సీఎం జగన్ పై జరిగిన దాడిని ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటనపై విజయవాడ సీపీ ఎన్నికల అధికారిని నేరుగా కలిసి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే సీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ పై ఈసీ బదిలీ వేటు వేసినట్లు తెలుస్తోంది. జగన్ పై రాయి దాడి జరిగిన నాటి నుంచే.. విజయవాడ సీపీపై ఈసీ వేటు వేస్తుందన్న చర్చ ప్రారంభమైంది. అయితే.. జగన్ పై దాడి, అనంతర పరిణామాలను పరిశీలించిన ఎన్నికల కమిషన్ సీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ పై వేటు వేసినట్లు తెలుస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు