Makeup Brushes : మేకప్ బ్రషెస్ ఇలా వాడారో.. మీ అందం పాడైనట్లే

కొంత మంది మేకప్ బ్రషేస్ వాడిన తర్వాత వాటిని క్లీన్ చేయకుండా.. మళ్లీ అలాగే వాడుతుంటారు. ఇలా చేస్తే చర్మానికి మంచిది కాదు. మేకప్ బ్రషెస్ ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి. లేదంటే వాటిలోని బాక్టీరియా, వైరస్, దుమ్ము.. చర్మం పై ఇన్ఫెక్షన్స్, ముడతలు వంటి సమస్యలకు దారితీస్తాయి.

New Update
Makeup Brushes : మేకప్ బ్రషెస్ ఇలా వాడారో.. మీ అందం పాడైనట్లే

Makeup Brushes : అందంగా కనిపించడానికి రకరకాల బ్యూటీ క్రీమ్స్(Beauty Creams), పౌడర్స్, ప్రాడక్ట్స్ వాడతాము. వాటిని అప్లై చేయడానికి  మేకప్ బ్రషెస్(Makeup Brushes) వాడడం కామన్. అయితే కొంత మంది అద్భుతంగా మేకప్ వేసుకుంటారు కానీ దాని కోసం ఉపయోగించే బ్రషేస్ మాత్రం చాలా డర్టీ గా వదిలేస్తారు.ఇక నెలకు ఒక్క సారైనా  క్లీన్ చేయనీ వారు కూడా ఉంటారు. టైం లేకపోవడం, బద్దకం, లేదా ఇతర పనుల్లో ఉండడం దీనికి కారణం కావచ్చు. కానీ మేకప్ బ్రషేస్ క్లీన్ చేయకుండా వాడితే చర్మానికి చాలా ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏంటో ఇప్పుడు తెలుసుుందాం..

చర్మ రంద్రాలు మూసుకుపోతాయి

మేకప్ బ్రషెస్ సరిగ్గా క్లీన్ చేయకుండా అలాగే మళ్ళీ వాడితే వాటిలోని బ్యాక్టీరియా, దుమ్ము చర్మ రంద్రాల్లోకి చేరి అవి మూసుకుపోయెలా చేస్తాయి. ఇది చర్మం పై బ్లాక్, వైట్ హెడ్స్, పింపుల్స్ రావడానికి కారణమవుతుంది. అలాగే చర్మాన్ని డల్, అనీవెన్ గా కనిపించేలా చేస్తుంది.

ఇన్ఫెక్షన్స్

శుభ్రం చేయని బ్రషెస్ వాడితే .. వాటిలోని జిడ్డు, పేరుకుపోయిన క్రీమ్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్(Fungal Infection) ను కలిగిస్తాయి.ఇది చర్మం పై డెడ్ స్కిన్ సెల్స్ కు కారణమవుతుంది. దుమ్ము, బ్యాక్టీరియా మొహం చిరాకు, మంటకు దారితీస్తాయి. అందుకే మేకప్ బ్రషేస్ ప్రతీ 7 నుంచి 10 రోజుల్లో ఒక్కసారైనా క్లీన్ చేస్తే చర్మ ఆరోగ్యానికి మంచిది.

Also Read: Rose Day: లవర్స్ కి ప్రపోజ్ టైం లో గులాబీ పువ్వునే ఎందుకు ఇస్తారు?

మేకప్ చెడిపోతుంది

మొదటి సారి మేకప్ వేసుకున్న బ్రషెస్ ను శుభ్రం చేయకుండా.. మళ్ళీ వాటినే వాడితే మేకప్ సరిగ్గా సెట్ అవ్వదు. ఇంతకుముందే వాటిలో పేరుకుపోయిన క్రీమ్స్ .. బ్రష్ ఉపయోగించేటప్పుడు ఆటంకం కలిగిస్తుంది. దీంతో మేకప్ ఫినిషింగ్ అనీవేన్ గా కనిపిస్తుంది . ఇది మొహాన్ని అందవికారంగా చేస్తుంది.

కళ్ళ కలకలు వచ్చే ప్రమాదం

అపరిశుభ్రమైన మేకప్ బ్రషెస్, ఒకరి బ్రషేస్ మరొకరు వాడడం కళ్ళ కలకలు వచ్చే ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఇది ఇతర ఐ ఇన్ఫెక్షన్స్(Eye Infections) కు దారి తీస్తుంది. ఇవి ప్రమాదకరం కాకపోయినప్పటికీ బ్యూటీ ప్రొడక్ట్స్(Beauty Products) వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

చర్మం పై ముడతలు

శుభ్రం చేయని బ్రషెస్ చర్మాన్ని ఆక్షికకరణ ఒత్తిడికి గురి చేస్తుంది. ఇది చర్మంలోని కొలాజిన్, ఎలాస్టిక్ గుణాల ప్రభావం చూపుతుంది. దీని కారణంగా చిన్న వయసులోనే చర్మం పై ముడతలు వచ్చే ప్రమాదం ఉంటుంది.

Also Read: Cholesterol Friendly Veggies: అధిక కొలెస్ట్రాల్ కు.. ఈ కూరగాయలతో చెక్ పెట్టండి

Advertisment
Advertisment
తాజా కథనాలు