MLC Kavitha: ఈడీ దూకుడు.. ఎమ్మెల్సీ కవితకు మరో షాక్

TG: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరో షాక్ ఇచ్చింది. ఆమెతో పాటి మరో నలుగురిపై సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన ఢిల్లీ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. మే 29న తుది తీర్పు ఇవ్వనున్నట్టు తెలిపింది.

New Update
MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దూకుడు పెంచింది. తాజాగా ఈ కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరో షాక్ ఇచ్చింది. ఆమెతో పాటి మరో నలుగురిపై సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన ఢిల్లీ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. మే 29న తుది తీర్పు ఇవ్వనున్నట్టు తెలిపింది. మరోవైపు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీలపై దాఖలైన సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను మే 28న విచారించాలని కోర్టు నిర్ణయించింది.


కస్టడీ పొడిగింపు..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న కవిత జ్యుడీషియల్ రిమాండ్ ను మరోసారి పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. జూన్ 3 వరకు ఆమె రిమాండ్ ను పొడిగిస్తున్నట్లు న్యాయమూర్తి కావేరి బవేజా ప్రకటించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam Case) కు సంబంధించి సీబీఐ కేసులో నేటితో ఆమె రిమాండ్ గడువు ముగియడంతో జైలు అధికారులు న్యాయమూర్తి ఎదుట వర్చువల్ విధానంలో హాజరుపర్చారు. ఈ నెల 24న ఢిల్లీ హైకోర్టులో సీబీఐ, ఈడీ బెయిల్ పిటిషన్లపై విచారణ జరగనుంది.

దీంతో ఆమెకు బెయిల్ వస్తుందా? న్యాయస్థానం ఎలంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఆమె కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 24న ఢిల్లీ హైకోర్టులో కవితకు బెయిల్ రాకపోతే.. సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితను మార్చి 15న ఈడీ (ED) అరెస్ట్ చేసింది. అనంతరం సీబీఐ సైతం ఇదే కేసులో ఆమెను అరెస్ట్ చేసింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు