ఎన్డీఏలోని బలమైన పార్టీలు అవే... బీజేపీ ఉద్దవ్ ఠాక్రే ఫైర్...!

మోడీ సర్కార్ పై శివసేన (యూబీటీ) చీఫ్, మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ), ఆదాయ పన్ను శాఖ(ఐటీ), సీబీఐలు ఎన్డీఏలోని మూడు బలమైన పార్టీలు అని ఆయన విమర్శలు గుప్పించారు. మణిపూర్ హింసాకాండ విషయంలో మోడీపై ఆయన ఫైర్ అయ్యారు.

New Update

publive-image

మణిపూర్ రాష్ట్రాన్ని సందర్శించేందకు కూడా ప్రధాని మోడీ రెడీగా లేరని ఠాక్రే తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఫైర్ అయ్యారు. ఇటీవల ఎన్డీఏ సమావేశంపై కూడా ఆయన విమర్శలు చేశారు. ఎన్నికల సమీపించినప్పుడు అది ఎన్డీఏ ప్రభుత్వమని, ఎన్నికలు ముగిసిన తర్వాత అది మోడీ సర్కార్ మాత్రమేనని ఎద్దేవా చేశారు.

ఎన్డీఏలో 36 పార్టీలు వున్నాయని చెప్పారు. అందులో ఈడీ, సీబీఐ, ఐటీలు మాత్రమే బలమైన పార్టీలు అని తెలిపారు. మిగిలిన పార్టీలు ఎక్కడ వున్నాయని ప్రశ్నించారు. ఎన్డీఏ కూటమిలో కొన్ని పార్టీలకు కనీసం ఒక్క ఎంపీ కూడా లేరన్నారు. బీజేపీ మొదట కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయాలని సవాల్ విసిరారు.

చట్టం ముందు అందరూ సమానమన్న మాట నిజమైతే బీజేపీలోని అవినీతి నేతలపై చర్యలు చేపట్టాలన్నారు. నిజమైన శివసేన పార్టీ తమదేనన్నారు. చీలికల వల్ల తమకు మంచే జరిగిందన్నారు. చాలా మంది సీనియర్ నేతలు తిరుగుబాటు చేసి వెళ్లిపోయారన్నారు. వారంతా చాలా కాలం పాటు పదవులు అనుభవించారని చెప్పారు. ఇప్పుడు తమ పార్టీలో కొత్త వారు వచ్చారని వాళ్లకు మంచి అవకాశం దొరుకుతుందన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు