Indian Railways: జనరల్ బోగీల్లో ప్రయాణిస్తున్నారా? అయితే మీకో శుభవార్త

జనరల్ బోగీల్లో ప్రయాణం చేసే ప్రయాణికులకు భారతీయ రైల్వే శాక తీపికబురు అందించింది. ఇక నుంచి తక్కువ ధరకే ఆహారం అందించాలని నిర్ణయించింది. రూ.20లకు స్నాక్స్, రూ.50లకు భోజనం సప్లై చేయనుంది. ఇప్పటికే కొన్ని స్టేషన్లలో ఈ సర్వీసులను ప్రారంభించింది.

New Update
Indian Railways: జనరల్ బోగీల్లో ప్రయాణిస్తున్నారా? అయితే మీకో శుభవార్త

publive-image

తరుచుగా జనరల్ కోచ్‌ల్లో రైలు ప్రయాణాలు చేస్తుంటారా? ఆకలిగా ఉన్నప్పుడు కడుపు నిండా ఏమైనా తినాలని ఉన్నా అంత ధర పెట్టి ఏం కొంటాంలే అని ఆగిపోయారా? అయితే ఇక నుంచి మీకు ఆ బాధలు ఉండవు. ఎందుకంటే ఇండియన్ రైల్వేస్ జనరల్ ప్రయాణికుల కోసం ఆహర పథకం తీసుకొచ్చింది. చాలా తక్కువ ధరకే ఆరోగ్యకరమైన ఆహారం అందించేందుకు సిద్ధమైంది. మీల్స్, స్నాక్స్, రెండింటి కాంబోను సర్వ్ చేయనుంది.

రూ.20కే స్నాక్స్.. రూ.50కే మీల్స్

రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫాంపై జనరల్ బోగీలు ఆగే ప్రాంతంలోనే ఈ ఎకానమీ ఫుడ్ కౌంటర్లను ఏర్పాటు చేయనుంది. దీంతో రైలు ఆగగానే వెంటనే ప్రయాణికులు ఆహారాన్ని తీసుకునేందుకు సులవుతుంది. ఇందులో రూ. 20కే ఏడు పూరీలు, డ్రై ఆలూ, పికిల్‌తో కూడిన బాక్స్, అలాగే రూ.50కు అన్నం, కిచిడీ, మసాలాదోశ, పావ్ బాజీ, రాజ్మా, ఛోలే లాంటి సరఫరా చేయనున్నారు. వీటితో పాటు తక్కువ ధరకే 200ఎమ్‌ఎల్ వాటర్ గ్లాసులను కూడా అందుబాటులో ఉంచనుంది. ఈ మీల్స్, స్నాక్స్ ఐఆర్‌సీటీసీ కిచెన్ యూనిట్ల ద్వారానే సరఫరా కానున్నాయి.

ఇప్పటికే 51 స్టేషన్లలో ప్రారంభం.. 

కౌంటర్లు ఎక్కడ ఏర్పాటు చేయాలనే నిర్ణయం జోనల్ రైల్వే అధికారులకే అప్పగించింది. ప్రస్తుతం ఆరు నెలల పాటు ఈ సర్వీస్ కౌంటర్లను ప్రయోగాత్మకంగా నిర్వహించనుంది. అవి విజయవంతం అయితే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో ఈ ఎకానమీ మీల్స్ కౌంటర్లను తెరవనుంది. ప్రస్తుతం 51 స్టేషన్లలో ఈ కౌంటర్లు అందుబాటులో ఉన్నాయని.. గురువారం నుంచి మరో 13 స్టేషన్లలో ఏర్పాటుచేశామని అధికారులు తెలిపారు. రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల జనరల్ బోగీల్లో ప్రయాణించే లక్షల మంది లబ్ధి చేకూరుతుంది. రిజర్వేషన్ లేని ప్రయాణికులు ఈ బోగీల్లో కిక్కిరిసి ప్రయాణిస్తుంటారు. ప్లాట్‌ఫాంపై లభించే స్నాక్స్ ఎక్కువ ధర పెట్టి కొనలేని ప్రయాణికులకు ఈ ఫుడ్ కౌంటర్లతో ఆకలి బాధ తీరనుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు