Dasara Holidays 2023: విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త.. రేపటి నుంచే దసరా సెలవులు.. లిస్ట్ ఇదే..!! తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు శుభవార్త. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు రేపటి నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. 13రోజుల పాటు సెలవులు ఉండగా...తిరిగి అక్టోబర్ 26న పాఠశాలల తిరిగి ప్రారంభం కానున్నాయి. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ఎస్ఏ1 పరీక్షలు బుధవారంతో ముగిసాయి. ఆ పరీక్షల ఫలితాలు సెలవుల అనంతరం వెల్లడించనున్నారు. అటు ఫార్మెటివ్ అసెస్ మెంట్ 1,2 పరీక్షల మార్కులను గురువారం లోపు చైల్డ్ ఇన్ఫోలో ఎంట్రీ చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. అన్ని జూనియర్ కళాశాలలకు ఈనెల 19వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. By Bhoomi 12 Oct 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు శుభవార్త. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు రేపటి నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. 13రోజుల పాటు సెలవులు ఉండగా...తిరిగి అక్టోబర్ 26న పాఠశాలల తిరిగి ప్రారంభం కానున్నాయి. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ఎస్ఏ1 పరీక్షలు బుధవారంతో ముగిసాయి. ఆ పరీక్షల ఫలితాలు సెలవుల అనంతరం వెల్లడించనున్నారు. అటు ఫార్మెటివ్ అసెస్ మెంట్ 1,2 పరీక్షల మార్కులను గురువారం లోపు చైల్డ్ ఇన్ఫోలో ఎంట్రీ చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. అన్ని జూనియర్ కళాశాలలకు ఈనెల 19వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం అపరేషన్ అజయ్ అటు ఇంటర్ విద్యార్థులకు సెలవులపై కీలక ప్రకటన వచ్చేసింది. తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు (Inter Colleges) ఈ నెల 19 నుంచి దసరా సెలవులు (Dasara Holidays) ప్రారంభం కానున్నట్లు ప్రకటనలో తెలిపింది. అనంతరం ఈ నెల 25వ తేదీ వరకు ఈ సెలవులు కొనసాగనున్నాయి. సెలవుల తర్వాత అక్టోబరు 26 నుంచి కాలేజీలు తిరిగి ప్రారంభం అవుతాయని ఇంటర్ బోర్డ్ ప్రకటనలో పేర్కొంది. దీంతో విద్యార్థులకు మొత్తం 8 రోజులు సెలవులు రానున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ జూనియర్ కాలేజీలు, ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు ఈ సెలవులు వర్తిస్తాయని ప్రకటనలో స్పష్టం చేసింది ఇంటర్ బోర్డ్. ఇదిలా ఉంటే.. తెలంగాణలోని స్కూల్స్ కు ఈ నెల 13 నుంచి అక్టోబర్ 25వ తేదీ వరకు మొత్తం 13 రోజుల పాటు దసరా సెలవులను ప్రకటించింది పాఠశాల విద్యాశాఖ. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు ఈ సెలవులను పాటించాలని తెలిపింది. ఇది కూడా చదవండి: వృద్ధాప్యంలో ఆస్టియో ఆర్థరైటిస్ ప్రమాదం ఎందుకు పెరుగుతుంది..?కారణాలేంటీ? ఇదిలా ఉంటే.. బతుకమ్మ, దసరా పండుగలకు సొంతూళ్లకు వెళ్లే వారి కోసం 5,265 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. ఈ నెల 13 నుంచి 25వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ స్పెషల్ బస్సుల్లో సాధారణ ఛార్జీలే ఉంటాయని ఆర్టీసీ ప్రకటనలో పేర్కొంది. #dussehra-2023 #dasara-holidays-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి