AP: అచ్యుతాపురం సెజ్ లో పేలిన రియాక్టర్.. నలుగురు కార్మికుల మృతి..!

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రియాక్టర్‌ పేలిన ఘటనలో నలుగురు కార్మికులు మృతి చెందారు. మరో14 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. వారందరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

New Update
AP: అచ్యుతాపురం సెజ్ లో పేలిన రియాక్టర్.. నలుగురు కార్మికుల మృతి..!

Anakapalli: అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. రియాక్టర్‌ పేలి సుమారు 18 మందికి పైగా తీవ్ర గాయాలు అయ్యాయి.  సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అలర్ట్ అయి ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేసి హుటాహుటినా బాధితులను కొంతమందిని అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. మరి కొంత మందిని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు.

Also Read: సైకిల్ పై వెళ్తున్న చిన్నారులను కాటేసిన కరెంట్.. కడపలో పెను విషాదం!

అయితే, వీరిలో నలుగురు కార్మికులు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలుస్తోంది. తీవ్రగాయాలపాలైన మిగిలిన 14 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. లంచ్ టైంలో పేలుడు జరగడంతో పెను ప్రమాదం తప్పింది.

ఈ ఘటనపై తోటి కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జరిగిన సంఘటనపై విచారణ చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. పరిసర గ్రామాల్లో దట్టంగా పొగలు అలుముకోవడంతో ప్రజలు భయాందోళనలో చెందుతున్నారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్, ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని సంఘటనపై వివరాలు తెలుసుకున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు