ఈ టిప్స్ ఫాలో అవ్వండి..ఈజీగా బరువు తగ్గండి! ఫిజికల్ యాక్టివిటీ లేకుండా చాలా మంది బరువు పెరుగుతున్నారు. అలాంటి సమస్యకి చెక్ పెట్టాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అవేంటో తెలుసుకోండి. By Durga Rao 29 Apr 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి నేటి కాలంలో చాలా మంది కంప్యూటర్స్ జాబ్ చేస్తున్నారు. దీంతో రోజంతా కూర్చూనే ఉంటున్నారు. దీని వల్ల ఎలాంటి యాక్టివిటీ లేకుండా బరువు పెరుగుతున్నారు. దీనిని దూరం చేసుకోవాలనుకుంటే హెల్దీ లైఫ్‌స్టైల్ ఫాలో అవ్వాలి. దీంతో బరువు కూడా తగ్గుతుంది. అవేంటో తెలుసుకోండి. బరువు తగ్గడంలో నీరు తాగడం కూడా కీ రూల్ పోషిస్తుంది. బాడీ హైడ్రేట్‌గా ఉంటే ట్యాక్సిన్స్ బయటకి వెళ్ళిపోతాయి. జీవక్రియ సరిగ్గా ఉంటుంది. కోరికలు కంట్రోల్ అయి అతిగా తినరు. కాబట్టి, ఓ బాటిల్ దగ్గర పెట్టుకుని రెగ్యులర్‌గా వాటర్ తాగండి. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేసి శక్తిని కూడా అందిస్తుంది. బాడీ డీటాక్స్ అయ్యేందుకు హెల్ప్ చేస్తుంది. ఎక్కువసేపు కూర్చుని వర్కౌట్స్ చసినా బాడీ అలసిపోతుంది. కాబట్టి అలా కాకుండా డెస్క్ డిప్స్, చైర్ స్క్వాట్స్ వర్కౌట్స్ చేయండి. ఇలానే కుర్చీలో కూర్చుని వర్కౌట్ చేయండి. దీని వల్ల మజిల్స్ చురుగ్గా పనిచేస్తాయి. జీవక్రియ మెరుగ్గా మారి బరువు తగ్గుతారు.ఎక్కువగా బాడీకి రెస్ట్ ఇవ్వకుండా పనిచేసినా బరువు పెరుగుతారు. అలా కాకుండా మీ బాడీ మాట వినండి, అవసరమైనప్పుడల్లా రెస్ట్ ఇవ్వండి. మధ్యమధ్యలో రెస్ట్ తీసుకోండి. ఈ టైమ్‌లో స్ట్రెచెస్ చేయండి. ధ్యానం చేయండి. డీప్ బ్రీథ్ తీసుకోండి. ఎప్పుడు తినే ఆహారం కాకుండా పోషకాహారం తినడం మంచిది. ప్రాసెస్డ్, పాస్ట్ ఫుడ్స్ బదులు ప్రోటీన్, కలర్ ఫుల్ వెజిటేబుల్స్, హోల్ గ్రెయిన్స్ తినడం అలవాటు చేసుకోండి. వీటితో కొత్త కొత్త వంటకాలని ట్రై చేయండి. దీని వల్ల పొట్ట నిండుగా ఉంటుంది. బరువు కూడా తగ్గుతారు.వర్కౌట్ చేయడానికి చాలా మంది ఇబ్బంది పడతారు. కొందరికీ కుదరకపోవచ్చు. అలాంటివారు కొన్ని సార్లు నడవడం అలవాటు చేసుకోండి. వీలైనప్పుడుల్లా అటు ఇటు నడవండి. మీకు ఓ కంపెనీ చూసుకుని వారితో కలిసి నడవడం, పార్కుకి వెళ్ళడం, సరుకులకి వెళ్ళడం వంటివి చేయండి. ఇలా రెగ్యులర్‌గా నడిస్తే కేలరీలు ఖర్చవుతాయి. బరువు కూడా తగ్గుతారు. #weight-loss-tips మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి