Office Vastu : ఆఫీసు టేబుల్ పై పొరపాటునా ఈ మొక్కలు పెట్టకండి..మీ ఉద్యోగానికి ఎసరు తప్పదు..! చాలా మందికి ఆఫీసులో కూడా మొక్కలు పెట్టే అలవాటు ఉంటుంది. కొందరు తమ టేబుల్‌పై అందంగా కనిపించే మొక్కలను ఉంచుతారు. కానీ వాస్తు ప్రకారం కొన్ని మొక్కలు ఆఫీసులో పెట్టకూడదని చెబుతారు. ఆ మొక్కలు ఏవో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి. By Bhoomi 28 Mar 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Office Vastu : మొక్కలు మన ఇంటి అందాన్ని పెంచుతాయి. కొంతమంది ఆఫీసులో కొన్ని మొక్కలను కూడా ఉంచుతారు.స్వంత బిజినెస్ లు ఉన్నవాళ్లు ఆఫీసుల్లో మొక్కలతో అందంగా తీర్చిదిద్దుతారు. ఇతర కంపెనీల్లో పనిచేసే వారు కూడా తమ డెస్క్‌పై కనీసం ఒక మొక్కనైనా ఉంచుకుంటారు. ఇలా తమకు నచ్చిన మొక్కలను ఆఫీసు టేబుల్ పై ఉంచడం వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. చాలా మంది టెక్ కంపెనీ ఉద్యోగులు తప్పనిసరిగా తమ చుట్టూ మొక్కలను ఉంచుతారు. ఎందుకంటే మొక్కలు ఒత్తిడిని తగ్గిస్తాయి. రకరకాల రంగుల్లో ఉండే మొక్కలను చూడగానే మనస్సు ఆహ్లాదకరంగా ఉంటుంది. అంతేకాదు నిత్యం కంప్యూటర్ ముందు పనిచేసే ఉద్యోగులు తమ కళ్లకు ఒత్తిడిని తగ్గించేందుకు పచ్చిన మొక్కలను చూస్తుంటారు. ఇలా చూడటం వల్ల పనిపై మెరుగ్గా దృష్టి సారిస్తారని నమ్ముతుంటారు. అయితే కొన్ని మొక్కలు ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయి. వాస్తు ప్రకారం ఈ మొక్కలు అదృష్టాన్ని తెస్తాయి. అయితే కొన్ని మొక్కలను ఆఫీసుల్లో ఉంచడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. వాటి వల్ల మీ కెరీర్‌లో ఎదుగుదల ఉండదు. అనేక అడ్డంకులు కూడా ఎదురవుతాయి. అందుకే ఆఫీసులో పెట్టకూడని మొక్కలేంటో చూద్దాం. గులాబీ మొక్క: గులాబీ మొక్క అంటే అందరికీ ఇష్టమే.కొంతమంది ఈ మొక్కను ఆఫీసులో కూడా పెంచుతారు. కానీ ఈ మొక్క చాలా సమస్యలను సృష్టిస్తుంది. ఇది ఇంట్లో మాత్రమే ఉపయోగించాలి. ఆఫీస్‌లో గులాబీ మొక్కను పెంచుకుంటే ఏ పనిలో విజయం సాధించలేరు. అలోవెరా ప్లాంట్: ఈ మొక్కను ఒక విధంగా పబ్లిక్ ప్లాంట్ అని చెప్పవచ్చు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ కలబంద మొక్క ఉంటుంది. అయితే ఆఫీసులో పెట్టుకుంటే ఇబ్బందులు తప్పవు. వృత్తి జీవితంలో ఏకాగ్రత పెట్టలేక, ఒక్క పనిని కూడా సరిగ్గా పూర్తి చేయలేకపోతున్నారు. వాస్తు ప్రకారం మీ వర్క్ డెస్క్‌పై కలబంద మొక్కలను ఉంచకపోవడమే మంచిది. ఎందుకంటే ఇది మీ పనిలో సవాళ్లను సృష్టిస్తుంది. అలాగే, ఇది మీ మానసిక స్థితి, పురోగతిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. వెదురు మొక్క: జ్యోతిష్య శాస్త్రంలో, వెదురు మొక్క అదృష్టం, శ్రేయస్సు చిహ్నంగా నమ్ముతారు. కానీ దానిని మీ ఆఫీసు డెస్క్‌పై ఉంచడం అశుభకరంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇది మీ కార్యాలయంలో ఉద్రిక్తతకు దారి తీస్తుంది. ఆఫీసు సహోద్యోగితో గొడవకు దారి తీస్తుంది. దీని పదునైన అంచులు కఠినత్వాన్ని సూచిస్తాయి కార్యాలయంలో ఒత్తిడితో కూడిన వాతావరణాన్ని సృష్టిస్తాయి. కాక్టస్: ఈ కాక్టస్ మొక్క ముళ్ల మొక్కల సమూహానికి చెందినది. దీన్ని ఆఫీసులో ఉంచితే ఇబ్బందులు తప్పవు. కాక్టస్ మొక్కలు చాలా ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, మీరు వాటిని మీ ఆఫీసు డెస్క్‌పై ఉంచకూడదు ఎందుకంటే అవి ప్రతికూల వాతావరణాన్ని సృష్టించగలవు. జాస్మిన్: ఈ పువ్వు మీ ఉత్పాదకతను ప్రభావితం చేస్తుంది. ఈ మొక్కను ఆఫీసు డెస్క్‌పై ఉంచకపోవడమే మంచిది. ఇది మీ పురోగతికి ఆటంకం కలిగిస్తుంది. #office-vastu #plants-on-table మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి