ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ సతీమణి డెలివరీ పార్వతీపురం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సతీమణి కరుణ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.బి వాగ్దేవి, ఆమె బృందం సురక్షితంగా ప్రసవం కావడానికి అన్ని చర్యలు తీసుకోవడంతో సేఫ్ గా డెలివరీ అయ్యారు. By Jyoshna Sappogula 09 Nov 2023 in ఆంధ్రప్రదేశ్ విజయనగరం New Update షేర్ చేయండి District collector: ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అంటే చాలామందికి ఇప్పటికీ చిన్న చూపు. అక్కడ అరకొర వైద్య సౌకర్యాలు ఉంటాయని.. వైద్యులు సరిగా పట్టించుకోరని ఏవేవో చెబుతుంటారు. అయితే, ఉన్నత స్థాయి అధికారులు ప్రభుత్వంపై నమ్మకం పెంచేందుకు పలు విధాలుగా ప్రయత్నిస్తుంటారు. ప్రజల్లో ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కలిగించేందుకు కృషి చేస్తునే ఉంటారు. తాజాగా, ఓ జిల్లా కలెక్టర్ తన భార్య ప్రసవం కోసం ఆమెను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. Also Read: రాష్ట్రం లోనే అత్యధిక దొంగ ఓట్లు కలిగిన నియోజకవర్గం చంద్రగిరిదే..! పార్వతీపురం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సతీమణి కరుణ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం సాయంత్రం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.బి వాగ్దేవి, ఆమె బృందం సురక్షితంగా ప్రసవం కావడానికి అన్ని చర్యలు తీసుకున్నారు.కాగా, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సతీమణి కరుణకు ఇది రెండవ కాన్పు. మొదటి కాన్పు కూడా రంప చోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయ్యారు. అప్పుడు నిశాంత్ కుమార్ రంప చోడవరం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారిగా పనిచేసేవారు. Also Read: ఆర్మీ జవాన్ పై పోలీసుల దాడి.. అనకాపల్లి జిల్లా ఎస్పీ సీరియస్ యాక్షన్..! ఫస్ట్ కాన్పులో ఆడపిల్లకు జన్మనిచ్చారు. జిల్లా కలెక్టర్ తన భార్యకు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చేయించడంపై ప్రభుత్వ పెద్దలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగైనా ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకంగా కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. #parvathipuram-district-collector #collector-wife-delivery-in-govt-hospital మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి