Floods: వరద బాధితులకు నేటి నుంచి నిత్యావసరాల కిట్లు పంపిణీ

AP: ఈరోజు నుంచి వరద బాధితులకు నిత్యావసరాల కిట్లు పంపిణీ చేయనుంది చంద్రబాబు సర్కార్. 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, లీటరు నూనెతో వ్ వంటి నిత్యావసర వస్తువులకు 2లక్షల కుటుంబాలకు అందించనుంది. రేషన్‌ కార్డులు లేని వారికి ఆధార్‌ లేదా బయోమెట్రిక్ ఆధారంగా పంపిణీ చేయనుంది.

New Update
Floods: వరద బాధితులకు నేటి నుంచి నిత్యావసరాల కిట్లు పంపిణీ

Floods: ఆంధ్ర ప్రదేశ్ లో వరద బాధితులకు నేటి నుంచి నిత్యావసరాల కిట్లు పంపిణీ చేయనుంది చంద్రబాబు సర్కార్. కిట్లను పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ పంపిణీ చేయనున్నారు. మొదటి రోజు 50 వేల కుటుంబాలకు కిట్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు అధికారులు. 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, కిలో పంచదార పంపిణీ చేయనున్నారు. అలాగే 2 కిలోల ఉల్లి, 2 కిలోల బంగాళదుంపలు, లీటరు నూనెతో కూడిన కిట్‌ అందించనున్నారు. 2 లక్షల కుటుంబాలకు నిత్యావసరాల కిట్లు పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ-పోస్‌ మిషన్‌ ద్వారా సరకుల పంపిణీ చేయనున్నారు. రేషన్‌ కార్డులు లేని వారికి ఆధార్‌ లేదా బయోమెట్రిక్ ఆధారంగా పంపిణీ చేయనుంది బాబు సర్కార్.

తెలంగాణలో కూడా..

తెలంగాణ లో కూడా వరద బాధితులను ఆదుకునేందుకు రేవంత్ సర్కార్ సిద్దమైంది. మొదటగా వరద కారణంగా ఎక్కువగా నష్టపోయిన ఖమ్మం జిల్లా ప్రజలకు ఆసరాగా నిలిచేందుకు కార్యాచరణ రూపొందించింది. ఈరోజు నుంచి ఖమ్మంలో వరద బాధితులకు రూ. 10 వేలు పంపిణీ చేయనుంది. కాగా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి ఖమ్మంలో జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి.. వారికి రాష్ట్ర ప్రభుత్వ అండగా ఉంటుందని.. అంజి విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. మొదటగా రూ.10వేల ఆర్థిక సాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ఈరోజు నుంచి జిల్లా వ్యాప్తంగా బాధితులకు రూ.10వేల ఆర్థిక సాయం అందించనుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు