Director Tharun Baskar: తరుణ్ భాస్కర్.. వాళ్ళకే పరిమితమా? తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు సినిమాతో మంచి డైరెక్టర్ గా గుర్తింపు పొందారు. ఆ తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మూడు సినిమాల టాక్ బాగానే వచ్చినా.. అయన సినిమాలు కేవలం ఒక వర్గానికి మాత్రమే పరిమితం అయినట్లుగా ఉన్నాయని టాక్. By Archana 07 Nov 2023 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Director Tharun Baskar: తరుణ్ భాస్కర్.. ఈయన గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. డైరెక్టర్, యాక్టర్, రైటర్, టీవీ ప్రేసెంటెర్ గా అందరికీ సుపరిచితులైన తరుణ్ భాస్కర్.. తన మొదటి సినిమా 'పెళ్లి చూపులు' తో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచి డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు. తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన 'పెళ్లి చూపులు' సినిమా బెస్ట్ ఫీచర్ ఫిలిం కేటగిరిలో 'నేషనల్ ఫిలిం అవార్డును' వరించింది. పెళ్లి చూపులు సినిమాతో మంచి సక్సెస్ చూసిన తరుణ్ భాస్కర్ కొంత కాలం గ్యాప్ తర్వాత 'ఈ నగరానికి ఏమైంది' మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మంచి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. 'ఈ నగరానికి ఏమైంది' సినిమా తర్వాత మళ్ళీ ఐదేళ్లు గ్యాప్ తర్వాత తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన 'కీడా కోలా' ఇటీవలే థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ దక్కించుకుంది. ఎప్పటి లాగే ఈ సినిమాలో కూడా యాక్టర్స్ ను కొత్తవాళ్ళనే తీసుకున్నారు. తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన సినిమాలు సూపర్ హిట్ అనే టాక్ వచ్చినప్పటికీ.. ఆయన సినిమాలు కేవలం ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ కు మాత్రమే పరిమితం అయ్యేలా ఉంటాయని టాక్. ఈయన డైరెక్ట్ చేసిన 'పెళ్లి చూపులు' అన్ని సెట్ ఆఫ్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యింది. కానీ ఆ తర్వాత వచ్చిన రెండు సినిమాలు కేవలం లిమిటెడ్ ఆడియన్స్ కు మాత్రమే రీచ్ అయ్యాయి. తెలుగు ఇండస్ట్రీలో టాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన తరుణ్ భాస్కర్ కేవలం కొంత మంది ప్రేక్షకులనే దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. కొత్త కొత్త కాన్సెప్ట్స్ ట్రై చేసే టాలెంట్ ఉన్నప్పటికీ.. ప్రయత్నిచడం లేదని టాక్ వినిపిస్తోంది. మూడు సూపర్ హిట్ సినిమాల తర్వాత కూడా తరుణ్ భాస్కర్ సినిమాల మార్కెట్ వ్యాల్యూ 5 కోట్లు దాటలేదు. కొత్తదానం ట్రై చేయడంలో తప్పు లేదు కానీ దాని వాళ్ళ తన మార్కెట్ వ్యాల్యూ తగ్గే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక నుంచైనా తరుణ్ భాస్కర్ ఫేమ్ ఉన్న హీరోలతో ఆడియన్స్ కు అందరికీ రీచ్ అయ్యే కథలు ఎంపిక చేసుకోవాలని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తరుణ్ భాస్కర్ తనకున్న టాలెంట్ తో ప్రపంచ వ్యాప్తంగా రీచ్ అయ్యే కథలను సృష్టించగలరని తమ అభిమానులు కూడా గట్టిగా నమ్ముతున్నారు. Also Read: Sharwanand: తండ్రి కాబోతున్న టాలీవుడ్ హీరో.! #director-tharun-baskar #director-tharun-baskar-movies మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి