విజయకాంత్ ను చంపేశారు..నెక్ట్స్ టార్గెట్ కమల్ హాసనే..దర్శకుడి షాకింగ్ కామెంట్స్.! సినీ యాక్టర్, డీఎండీకే పార్టీ వ్యవస్థాపకుడు విజయకాంత్ ను చంపేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు మలయాళ దర్శకుడు అల్ఫోన్స్ పుత్రేన్. హంతకులను పట్టుకోకపోతే నెక్ట్స్ టార్గెట్ కమల్ హాసన్, సీఎం స్టాలిన్ అవుతారని షాకింగ్ కామెంట్స్ చేశారు. By Jyoshna Sappogula 28 Dec 2023 in సినిమా నేషనల్ New Update షేర్ చేయండి Director Alphonse Puthren Sensational Comments: తమిళనాడు సినీ యాక్టర్, డీఎండీకే పార్టీ వ్యవస్థాపకుడు విజయకాంత్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతితో ఇటు సినిమా, అటు రాజకీయ రంగాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదిలా ఉండగా, విజయకాంత్ ను ఎవరో హత్య చేశారని మలయాళ దర్శకుడు అల్ఫోన్స్ పుత్రేన్ సోషల్ మీడియాలో షాకింగ్ కామెంట్స్ చేయగా అవి కాస్తా వివాదాస్పదంగా మారాయి. తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు, మంత్రి, హీరో ఉదయనిధి స్టాలిన్ ను ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ట్యాగ్ చేశారు. 'ఉదయనిధి స్టాలిన్ అన్నా..కేరళ నుంచి చెన్నై వచ్చిన నేను, రెడ్ జెయింట్ ఆఫీసులో కూర్చుని మీరు రాజకీయాలలోకి రావాలి అని నేను చెప్పాను. కలైంజర్ (కరుణానిధి)ని ఎవరు మర్డర్ చేశారో, ఐరన్ లేడీ జయలలితను మర్డర్ చేసింది ఎవరో మీరు కనిపెట్టాలని అడిగాను. ఇప్పుడు మీరు కెప్టెన్ విజయకాంత్ ను ఎవరు హత్య చేశారో కనిపెట్టాలి. ఇప్పటికే ఇండియన్ 2 సెట్స్ లో కమల్ హాసన్ గారిని ..మిమ్మల్ని హత్య చేసే ప్రయత్నం చేశారు. వాళ్లను పట్టుకోవాలని. ఒకవేళ హంతకులను పట్టుకునే ప్రయత్నం చేయకపోతే..మిమ్మల్ని లేదా స్టాలిన్ గారిని టార్గెట్ చేస్తారు. నీరం సినిమా విజయవంతమైన తర్వాత మీరు నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారు. గుర్తుందా? ఐ ఫోన్ సెంటర్ కు కాల్ చేసి 15 నిమిషాల్లో బ్లాక్ కలర్ లో ఉన్న ఐఫోన్ ను తెప్పించి నాకు ఇచ్చారు. ఉదయనిధి స్టాలిన్ అన్నా.. మీకు అది గుర్తు ఉంటుందని అనుకుంటున్నా.. మర్డర్స్ చేసిన వాళ్ళను పట్టుకుని వాళ్ళ మోటివ్ ఏంటనేది తెలుసుకోవడం మీకు ఐ ఫోన్ తెప్పించడం కంటే సింపుల్ ' అని అల్ఫోన్స్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Also Read: హద్దులు చెరిపేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. హాట్ పిక్స్ తో హల్‌చల్.! #vijayakanth-death #alphonse-puthren మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి